
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2021) పండుగల సెలవులు (సాధారణ సెలవులు) ఎక్కువగా ఆదివారం రాకపోవడంతో ఉద్యోగులకు సంతోషం కలిగిస్తోంది. అయితే, ఐచ్ఛిక సెలవులు మాత్రం నాలుగు ఆదివారాలు వచ్చాయి. సాధారణ సెలవుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ మాత్రమే ఆదివారం వచ్చింది.
మిగతా సెలవులన్నీ ఇతర వారాల్లోనే వచ్చాయి. వచ్చే ఏడాది సాధారణ సెలవులను, ఐచ్ఛిక సెలవులను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.