
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి మరిన్ని లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
నిబంధనలు ఇవే
► ప్రార్థన మందిరాల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
► ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి.
► ప్రార్థన మందిరాల్లో భక్తులను దశల వారీగా పంపించాలి. క్యూలైన్లలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి.
► భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. తీర్ధ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు. విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి.
► హోటల్స్ సిబ్బంది గ్లోవ్స్, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. సీట్లు కూడా దూరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి
► మాల్స్‌లోనూ భౌతిక దూరం జాగ్రత్తలు తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment