సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్‌ఈసీ నీలం సాహ్ని గురువారం కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. కాగా, ఎస్‌ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్‌ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. సాయంత్రం ఎన్నికల ప్రక్రియపై ఎస్‌ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉంది. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది కాకుండా ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
చదవండి:
ఏపీ: ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా?
ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నీలం సాహ్ని
Published Thu, Apr 1 2021 2:02 PM | Last Updated on Thu, Apr 1 2021 6:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment