
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రి జగన్‌కి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ)
తాడేపల్లి వైస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వేకటేశ్వర్లు, పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జననేత పుట్టిన రోజును స్వచ్చందంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు పండుగలా చేసుకుంటున్నారు. ప్రజలను దగ్గరకు తీసుకున్న నాయకుడు ఇప్పుడు వారికి ధీమా ఇస్తూ పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ పుట్టిన రోజు ప్రతి ఇంట్లో జరుగుతోంది. ప్రజల ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు కనుకే ఈ రోజు ఈ సుపరిపాలనలో భాగంగా ఏడాదిన్నరలోనే అనేక మార్పులు చేపడుతూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏ సమస్య లేకుండా 60 వేల కోట్ల నిధులు ప్రజల అకౌంట్‌కి చేరాయి. పారదర్శకత, అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు’ అని తెలిపారు. (చదవండి: ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..)
‘కోవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడితే మన రాష్ట్రం త్వరగా కొలుకుంది. ఇది చూసి అధికారులు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ఈ రోజు ఒక యువ నాయకుడు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో పవర్ కేంద్రీకృతం అయితే ఈ నాయకుడు వికేంద్రీకరణ చేసి ప్రజలకు పవర్ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్నాయి.. అందుకే మేము ఈ రక్తదానం కార్యక్రమం చేపట్టాము. ప్రజలకు సేవ చేయండి అని మా నాయకుడు ఇచ్చిన పిలుపే ఈ సేవా కార్యక్రమాలకు నాంది. ఆయన వందేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ.. ఆరోగ్యాంగా ఉండాలి’ అని కోరుకున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment