
నీలం సాహ్ని ( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు తన పిల్‌ను ఉపసంహరించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment