సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నీలం సహానిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీసీఏల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సహాని ఏపీ కేడర్ అధికారి. డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సహానిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విదితమే. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్ అయిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర సర్కారు నియమించింది. జూన్ 20, 1960న జన్మించిన నీలం సహాని వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఓ మహిళా ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం ఇదే తొలిసారి.
ఏపీ సీఎస్‌గా నీలం సహాని
Published Wed, Nov 13 2019 10:27 PM | Last Updated on Thu, Nov 14 2019 8:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment