
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొన్ని గంటలకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగా జ్యోతుల నెహ్రూ గళం విప్పారు. చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేడర్ అభిప్రాయాలు చంద్రబాబుకు పట్టవా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదని అన్నారు.
చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ