ఉచిత సిలిండర్‌.. బాబుకు షాకిచ్చిన సొంత ఎమ్మెల్యే | TDP MLA Jyothula Nehru Sensational Comments Over Free Gas Cylinder | Sakshi
Sakshi News home page

ఉచిత సిలిండర్‌.. బాబుకు షాకిచ్చిన సొంత ఎమ్మెల్యే

Published Fri, Nov 1 2024 6:27 PM | Last Updated on Fri, Nov 1 2024 7:19 PM

TDP MLA Jyothula Nehru Sensational Comments Over Free Gas Cylinder

సాక్షి, కాకినాడ: ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలుపై కూటమి నేతలు గుర్రుగా ఉ‍న్నారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అంటూ డబ్బులు కట్టించుకోవడం ఏంటి? అని టీడీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ముఖ్మమంత్రి చంద్రబాబును దీనిపై ప్రశ్నిస్తానని కామెంట్స్‌ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలును వ్యతిరేకిస్తున్నాను. లబ్ధిదారుల నుండి డబ్బులు కట్టించుకోవడం సరికాదు. ఉచితం అంటే ఉచితంగానే కనిపించాలి. ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు రూ.2,800 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అలాంటప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి.. లేదంటే ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలో వేయాలి.

అంతేకానీ ఇలా చేయడం సరికాదు. సిలిండర్ కోసం డబ్బులు లేకపోతే సామాన్య ప్రజలు రూ.5,10 వడ్డీకి దళారుల వద్ద అప్పు చేయాల్సిన పరిస్ధితి ఉంటుంది. దళారులు బాగుపడటానికి అధికారులే ఈ వ్యవస్ధను పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ విషయంపై నిర్మోహమాటంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబును అడుగుతాను. చంద్రబాబు నిల్చోబెట్టి ఈ విధానాన్ని మారుస్తాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement