
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : పరిషత్ పోరులోనూ ఫ్యాన్ హవా కొనసాగింది. పల్లెపల్లెనా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా స్థానాలు దక్కించుకుని జిల్లాలో ప ట్టును మరోసారి చాటింది. టీడీపీ కంచుకోటగా ఉన్న మండలాల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గణపవరం, ఏలూరు రూరల్ మండలాల్లో నూరు శాతం ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా రికార్డు మెజార్టీలు సాధించారు. మొత్తంగా 48 స్థానాలకు గాను 47 చోట్ల ఎన్నికల ప్రక్రియ జరగ్గా 45 స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 3,600 మంది సిబ్బంది
► ఏలూరు డివిజన్ పరిధిలో 16 జెడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరిగింది.
► నరసాపురం డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ, 218 ఎంపీటీసీ స్థానాలకు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు.
► కొవ్వూరు డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ, 249 ఎంపీటీసీ స్థానాలకు తణుకు ఏఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరిగింది.
► జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్ల పరిధిలో 7 జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలకు జంగారెడ్డిగూడెం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు.
జెడ్పీటీసీలు ఇలా..
జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను పెనుగొండ జెడ్పీటీసీ అభ్యర్థి ఒకరు మరణించడంతో అక్కడ నిలిచిపోయింది. ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం కా గా మిగిలిన 45 స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 43 స్థానాలు, టీడీపీ, జనసేన చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందాయి. మొత్తంగా 45 స్థానాలతో వైఎస్సార్ సీపీ సత్తాచాటింది. జంగారెడ్డిగూడెం, ఏలూరు రూరల్ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నిక జరగలేదు.
673 స్థానాల్లో విజయఢంకా
జిల్లాలో 876 ఎంపీటీసీ స్థానాలకుగాను 73 ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు మరణించడం తదితర కార ణాలతో 22 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. 781 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ 608, టీడీపీ 99, జనసేన 60, ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు. ఏMýగ్రీవాలతో కలిసి 673 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. పెదవేగి, చాగల్లు మండలాల్లో ఒక్కో స్థానానికి రీకౌంటింగ్ జరిగింది. ఏలూరు (11), గణపవరం (19) మండలాల్లో అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు.
టీడీపీ ఒకటి.. జనసేన ఒకటి..
ఆచంట జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఉప్పలపాటి సురేష్‌బాబు గెలుపొందారు. వీరవాసరం జెడ్పీటీసీ స్థానంలో గుండా జయప్రకాష్ నాయుడు జనసేన తరçఫున గెలుపొందారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు భంగపాటు
జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గట్టి షాక్ తగిలింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత మండలమైన పాలకొల్లులో 14 ఎంపీటీసీలకు 8 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా టీడీపీ ఐదు స్థానాలకు పరిమితమైంది. ఎమ్మెల్యే స్వగ్రామం అగర్తపాలెంలో ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపొందారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సొంత మండలం కాళ్లలోనూ వైఎస్సార్ సీపీ పట్టు సాధించింది. 19 ఎంపీటీసీ స్థానాలకు 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎమ్మెల్యే స్వగ్రామం కలవపూడిలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు.
పకడ్బందీగా కౌంటింగ్
ఏలూరు, (మెట్రో): జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి సత్యనారాయణ, కలెక్టర్ కార్తికేయమిశ్రా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును విజయవంతంగా ముందుకు సాగించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఉదయం 7, 8 గంటల మధ్యలో బ్యా లెట్ బాక్సులు తీసుకువచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్‌పత్రాలు వేరు చేసి కట్టలు కట్టారు. ఉదయం 10 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అర్ధరాత్రి 1 గంట వరకు కౌంటింగ్ ప్రక్రియ సాగింది. మధ్యాహ్నం నుంచి
ఏలూరులో వర్షం కురవడంతో బయట విధులు నిర్వహించే పోలీసులు, సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారు. పార్టీల ఏజెంట్లు, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్‌ను జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మధ్యాహ్నానికి పూర్తి చేసి మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో కొవ్వూరు డివిజన్, మూడో స్థానంలో నరసాపురం డివిజన్, చివరి స్థానంలో ఏలూరు డివిజన్ నిలిచాయి.
24 ఎంపీపీ.. 25న జెడ్పీ చైర్మన్ ఎన్నిక
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 24న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ మెంబర్ స్థానాలకు, 25న జిల్లాపరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల స్థానాలకు జిల్లా అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు.
పోలైనవి 53.. చెల్లనివి 47
భీమడోలు: భీమడోలు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోలైన 53 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 47 చెల్లుబాటు కాలేదు. ఆరు ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా వైఎస్సార్ సీపీ 4, టీడీపీ, జనసేనకు ఒక్కొ క్కటి చొప్పున వచ్చాయి. ఉద్యోగులు డిక్లరేషన్ పత్రంలో ఎంపీటీసీ స్థానాన్ని నమోదు చేయకపోవడంతో ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
దీని వల్ల జిల్లాలోనే భీమడోలు మండలంలో అత్యధికంగా ఓట్లు చెల్లబాటు కాకుండాపోయాయి. పోస్టల్ ఓటు వేసే తరుణంలో ఉద్యోగి తాము ఏ ఎంపీటీసీ స్థానానికి చెందిన ఓటరు అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అదే జెడ్పీటీసీ ఓటు కు మండలం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. ఇదిలా ఉండగా జెడ్పీటీసీ స్థానానికి మా త్రం 72 ఓట్లలో 69 చెల్లుబాటు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment