
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీని ఎదుర్కోగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరుతో ఆ పార్టీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎన్నికల నుంచి ఎప్పుడూ తప్పుకోదని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీని మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా నమ్ముతున్నారని, ప్రజల కోసం మరింత బాధ్యతగా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషించబోతున్నామని పేర్కొన్నారు.
వైద్య పరికరాల స్కామ్‌పై విచారణ వేగవంతం చేయాలి
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల కొనుగోలు, నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై సీఐడీ వేగంగా విచారణను పూర్తిచేసి అసలైన దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోము వీర్రాజు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసినట్టు ఆ పార్టీ శుక్రవారం మరో ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment