అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2021 జనవరి 8 నుంచి మార్చి 10 వరకు సుప్రీంకోర్టు చెప్పిన 4 వారాల స్థానిక ఎన్నికల నియమావళి పూర్తయింది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు.
డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపుపై స్టే ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 4 వారాల కోడ్ అమలు చేయలేదని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే కోడ్ అమలు చేశారన్నారు. 4 వారాల కోడ్ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా ఎస్‌ఈసీని అడగలేదని, ఈ కోడ్‌పై ఏ ఒక్కరు కోర్టుకు ఫిర్యాదు చేయలేదని లాయర్ నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏప్రిల్ 8న జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment