సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. వర్ల రామయ్య పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరఫు లాయర్ పేర్కొన్నారు. వర్ల రామయ్య వ్యక్తిగతంగా పిటిషన్ వేశారని.. ఆయన ఎక్కడా పోటీచేయట్లేదని.. ఎన్నికలతో ఆయనకు సంబంధంలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.
‘‘సుప్రీం ఆదేశాలను అమలు చేస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరగా ఎన్నికలు పూర్తిచేసి ప్రజాసంక్షేమంపై ప్రభుత్వం దృష్టిపెడుతుంది. 4 వారాల ఎన్నికల నియమావళి కోడ్ ఉండాలని చట్టంలో ఎక్కడాలేదు. పిటిషనర్ కోరిన విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే.. గతంలో ఇదే కోర్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలు ఆమోదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు విఘాతం కలుగుతుంది.ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత వారి ఎన్నికను రద్దు చేసే అధికారం ఎన్నికల పిటిషన్ ద్వారా సవాల్ చేస్తేనే రద్దు చేసే అవకాశం ఉందని’’ ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment