
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అగ్రవర్ణాల వారికి రూ.వెయ్యి, ఎస్సీ కాలనీల్లో రూ.2 వేలు, ఎస్టీ కాలనీల్లో రూ.3 వేలు, కేజీ చికెన్ చొప్పున బుధవారం రాత్రి పంపిణీ చేశారు.
టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి నగదుతోపాటు మద్యం సీసాలు కూడా ఇచ్చారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో మాత్రం టీడీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు.