
సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూరల్‌లో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందనే చంద్రబాబు నాటకానికి తెరలేపారన్నారు. గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం చేయాలని బాబు ఇంటర్నల్ ఆదేశాలిచ్చారన్నారు. మళ్లీ ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు.
‘‘పేమెంట్ కోసం సొల్లు కబుర్లు చెప్పే వ్యక్తి పవన్ కల్యాణ్. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అని పిలిపించుకునే వ్యక్తి పవన్. జన సైనికులు.. జన సైకిల్‌గా మారారని’’ ఆయన ఎద్దేవా చేశారు. కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినా చంద్రబాబు బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావో చూసుకోవాలన్నారు. సీపీఎం, బీజేపీ నోటాతో పోటీ పడే పార్టీలంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
చదవండి:
‘పవన్, లోకేష్.. ఇదో అజ్ఞానపు సంత’
భూమా అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment