
చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీ స్థానంలో 1347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న నిమ్మకూరులో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల తరహాలో మరో ఎంపీటీసీ ఫలితం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వైఎస్సార్ కడప జిల్లా కమలాపూర్ మండలం దేవరాజుపల్లి ఎంపీటీసీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 191 ఓట్లు ఉండగా వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఏకంగా 186 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలకు కనీసం ఒక్క ఓటు కూడా రాకపోవడం విశేషంగా మారింది. కనీసం స్వతంత్ర అభ్యర్థికి కూడా దాటలేకపోయారంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు కొందరు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment