
తిరుపతి కల్చరల్: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.
ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దౌర్జన్యాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నిజాయితీగా జరిగితే టీడీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ ఓట్లు చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.