సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆ పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అలాంటప్పుడు పోటీ చేసి పరువు పోగొట్టుకుని బాధపడడం కంటే, ఎదో ఒక వంకతో పోటీలో లేకుండా పక్కకు తప్పుకుంటే మంచిదని ఎక్కువ మంది నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ నేత వర్ల రామయ్యతో కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేయించారు.
గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మిగిలిన ప్రక్రియ కొనసాగుతుందని ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక పోటీలో ఉంటే పరువు పోవడం ఖాయమని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో దౌర్జన్యాలు జరిగాయనే సాకు చూపి పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిపి చంద్రబాబు అందులో ఈ నిర్ణయం ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి:
సీఎం జగన్ చిత్రపటానికి తెలంగాణ ఉద్యోగుల క్షీరాభిషేకం
అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని..
Comments
Please login to add a commentAdd a comment