
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం అయిదు జెడ్పీటీసీ స్థానాలను, 71 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మాచర్ల మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దుర్గి మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందగా, వెల్దుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.
► మాచర్ల మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14
► దుర్గి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14
► వెల్దుర్తి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14
►కారంపూడి మండలం లో మొత్తం ఎంపీటీసీ 15
► రెంటచింతల మండలం మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14
► నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment