Naravaripalli
-
అక్రమ రవాణాకు పోలీస్ ఎస్కార్ట్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి, పాడిపేట నుంచి మట్టి, ఇసుక ప్రతి రోజూ రాత్రిళ్లు 30 టిప్పర్లలో తిరుపతికి తరలి వెళ్తోంది. ఈ దందాను అరికట్టాల్సిన పోలీసులే ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఆ వాహనాలకు రక్షణ కల్పిస్తుండడం విస్తుగొలుపుతోంది. -
నారావారి పల్లె ఎంపిపి స్కూలులో ఆధునిక సౌకర్యాలు
-
నారా చంద్రబాబునాయుడు ఘోర పరాజయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి సరే కానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓడిపోవడం ఏమిటని అనుకుంటున్నారా! అయితే ఈ లెక్క చూడండి. బాబుకు ఘోర పరాభవంతో కూడిన పరాజయం దక్కిందని అందరూ ఒప్పుకుంటారు. చివరికి టీడీపీ శ్రేణులు కూడా. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కుప్పం నుంచి ఓ రకంగా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చంద్రబాబు గెలుపొందారు. అప్పటికి వరుసగా ఆరుసార్లు గెలిపించిన కుప్పంలో ఈ దఫా కొన్ని రౌండ్లలో వెనక్కు వెళ్లి, మరికొన్ని రౌండ్లలో ముందుకొచ్చి మొత్తంగా కుప్పం నుంచే ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగోలా బయటపడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దారుణ పరాజయమే మిగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 74 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించగా, 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒక చోట కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ కుప్పం జెడ్పీటీసీ అభ్యర్థి ఏడీఎస్ శరవణ 17,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, గుడుపల్లె అభ్యర్థి కృష్ణమూర్తి 11,928 ఓట్ల ఆధిక్యతతో, శాంతిపురం అభ్యర్థి శ్రీనివాసులు 16,893 ఓట్ల ఆధిక్యతతో.. రామకుప్పం అభ్యర్థి కే రాఘవరెడ్డి 16,118 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం నాలుగు మండలాల్లోని మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 63 స్థానాలను (ఇందులో ఒకటి ఏకగ్రీవం) వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. కేవలం మూడు ఎంపీటీసీలు మాత్రమే టీడీపీ గెలుపొందగా, రెండు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నిక జరగలేదు. కుప్పం మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు 20 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా... వైఎస్సార్సీపీ 18 చోట్ల విజయం సాధించగా, టీడీపీ రెండింట మాత్రమే గెలుపొందింది. గుడుపల్లె మండలంలో 13కు గాను 12 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కు 16, శాంతిపురం మండలంలో 18కి 17 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మొత్తంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 84,160 ఓట్లు, టీడీపీకి 21,863 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి 62,297 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇలా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇది చంద్రబాబుకు దక్కిన ఘోర పరాభవంగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిత్తూరులో టీడీపీ చిత్తు చిత్తు ► చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలనూ వైఎస్సార్సీపీనే గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహా మొత్తం 14 నియోజకవర్గాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే తిరుగులేని విజయం సాధించారు. ► జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలుండగా, 30 స్థానాలు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. రెండు స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నికలు నిలిచిపోగా, మిగిలిన 33 స్థానాల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గెలుపొందిన ప్రతి స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులపై భారీ ఓట్ల మెజారిటీ రావడం విశేషం. ► జిల్లాలోని 886 ఎంపీటీసీ స్థానాల్లో 410 చోట్ల వైఎస్సార్సీపీకి, టీడీపీకి 8, సీపీఐకి 1, ఇతరులకు 14 స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. 34 ఎంపీటీసీ స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 419 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 389 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ కేవలం 25 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు ఐదు చోట్ల గెలుపొందారు. ► మొత్తంగా ఎన్నికలు జరగని 34 స్థానాలను మినహాయిస్తే, 852 ఎంపీటీసీలకు గాను799 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 33 స్థానాల్లో టీడీపీ, సీపీఐ 1, ఇతరులు 19 చోట్ల గెలుపొందారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలను తొలిసారిగా చవిచూసిన బాధ కంటే, చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ స్థాయిలో పార్టీ కుప్పకూలడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. కుప్పంలో చరిత్ర తిరగరాసిన ఫ్యాన్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తొలిసారిగా చరిత్ర తిరగ రాసింది. జెడ్పీటీసీ వ్యవస్థ మొదలైన తర్వాత మొదటిసారిగా టీడీపీకి అక్కడ బోణీ లేకుండా పోయింది. 1989 నుంచి స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ పై చేయి సాధిస్తూ వచ్చింది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రహ్మణ్యంరెడ్డి గెలుపొందారు. మిగిలిన మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. అదే ఏడాది రామకుప్పం ఎంపీపీగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ గెలుపొందారు. మిగిలిన ఎంపీపీలన్నీ టీడీపీ గెలిచింది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీపీలనూ టీడీపీనే గెలుచుకుంది. అయితే 2021లో మొత్తం సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన, కుప్పంలో జరిగిన అభివృద్ధి పనుల వల్లే ఇక్కడి ప్రజలు సైకిల్‌కు పంక్చర్ చేసి, ఫ్యాన్‌కు పట్టం కట్టారు. చంద్రబాబు సొంతూరులో వైఎస్సార్సీపీ జెండా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారా వారిపల్లెలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించారు. నారావారిపల్లె గ్రామం ఉన్న చిన్నరామాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య, టీడీపీ అభ్యర్థి గంగాధరంపై 1,399 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎంపీటీసీ పరిధిలో మొత్తం 3,040 ఓట్లు ఉంటే 2,061 ఓట్లు పోలయ్యాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీకి 1,704 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గంగాధరంకు కేవలం 305 ఓట్లు వచ్చాయి. చంద్రబాబుకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రగిరి మండలంలోని 16 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం సైతం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవలేదు. -
నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు షాకిచ్చారు.ఆయన నియోజకవర్గం కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ దారుణ ఓటమి చెందింది. నాలుగు మండల్లాలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైఎస్సార్సీపీ-17, టీడీపీ -2 సాధించాయి. గుడిపల్లె మండలంలో 12కి గాను 12 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కి గాను 16 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. శాంతిపురం మండలంలో 18కిగాను 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చదవండి: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. ‘ప్రజలు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు’ -
ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వం: చంద్రబాబు గ్రామంలోనూ..
తిరుపతి : మహమ్మారి కరోనా వైరస్ బాధితుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు వచ్చారు. కరోనా బాధితుల కోసం తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో ఏకంగా 150 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు సిద్దం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రగిరిలో 100 బెడ్లు, 500 పడకలతో చంద్రగిరిలోనే మరొక కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రజలకు సత్వర కరోనా సేవలే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వంపై నియోజకవర్గ ప్రజలతో పాటు చాలామంది అభినందిస్తున్నారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
చంద్రబాబుకు ఇది నిజంగా చెంపదెబ్బే..
సాక్షి, చంద్రగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి నారావారిపల్లి గ్రామ ప్రజలు జై కొట్టారు. చంద్రబాబు సొంతూరు అయిన నారావారిపల్లెలోనూ ఇంగ్లీషు మీడియం విద్యకు గ్రామస్తులు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నారావారిపల్లెకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి.. ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. దీంతో పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే.. ఇంగ్లీషు మీడియం విద్యకు ఇంతకాలం మోకాలడ్డుతున్న కొంతమంది కుహనా మేధావులకు, తల్లిభాష పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, పేదవర్గాలకు పెద్ద చదువులు అందకూడదని కుట్రలు పన్నుతున్న ఎల్లో మీడియా శక్తులకు నారావారిపల్లె నుంచే ప్రజలు బుద్ధి చెప్పినట్లు అయింది. సొంతూరులో చంద్రబాబుకు ఇది నిజంగా చెంపదెబ్బే. రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చే కార్యక్రమానికి నడుం బిగించారు. ప్రభుత్వ విద్యా విధానంలో మెరుగైన ఫలితాలను తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కార్పోరేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు చెల్లించగలిగే వారికే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా చేరువ చేయాలనే సంకల్పాన్ని సాకారంలోకి తెచ్చారు. చదవండి: బాబును ఎవరూ నమ్మొద్దు.. అన్నీ దొంగ సర్వేలే ఈ నిర్ణయాలన్నింటి పైనా నారావారిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాల్సి ఉండగా.. 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ఏకగ్రీవంగా వారి నిర్ణయాన్ని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం భోదించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంగ్లీష్ మీడియం విద్యకు ఇంతకాలం మోకాలడ్డుతున్న కొంతమంది కుహానా మేధావులకు, తల్లిభాష పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, ఎల్లో మీడియా శక్తులకు నారావారిపల్లి ప్రజలు బుద్ధి చెప్పినట్లయ్యింది. -
నారావారిపల్లెలో వికేంద్రీకరణ గళం
-
నారావారిపల్లెలో ప్రజా వెల్లువ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లె జన జాతరను తలపించింది. ఏ వైపు చూసినా వేలాది మామిడి తోరణాలతో ఉత్సవ శోభను సంతరించుకుంది. వికేంద్రీకరణకు మద్దతుగా వెల్లువలా వచ్చిన ప్రజలతో పండుగ వాతావరణం కనిపించింది. కనీవినీ ఎరుగని రీతిలో.. బహిరంగ సభను తలపిస్తూ ‘పాలన వికేంద్రీకరణ ప్రజాసదస్సు’ సాగింది. ఆ గ్రామ చరిత్రలో బహిరంగ సభను ప్రజలు చూసింది లేదు. రచ్చబండ సమావేశాలు మినహా ఇప్పటివరకూ ఎలాంటి సభలను గ్రామంలో నిర్వహించిన దాఖలాలు లేవు. సదస్సుకు 25 వేల మందికి పైగా హాజరు కాగా.. అనేక మంది తమ ఇళ్లల్లోనే ఉండి వక్తల మాటలను శ్రద్ధగా ఆలకించారు. చుట్టుపక్కల గల 15 గ్రామాల ప్రజలు సైతం ప్రసంగాలను వినేందుకు వీలుగా వందలాది మైక్ సెట్లు ఏర్పాటు చేశారు. కాలూరు క్రాస్, శ్రీనివాస మంగాపురం, నరసింగాపురం క్రాస్, రంగంపేట మీదుగా నారావారిపల్లె వరకూ దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరీ.. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందుకు తగిన ఏర్పాట్లను 48 గంటల్లో చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నారావారిపల్లె చరిత్రను తిరగరాశారని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. పాలన వికేంద్రీకరణపై ఆదివారం నిర్వహించిన ప్రజా సదస్సుకు ప్రభుత్వ ముఖ్యులు, మంత్రులతోపాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదనరెడ్డి, వెంకటేగౌడ తదితరులు హాజరయ్యారు. సదస్సులో మాట్లాడిన వక్తలు ఏమన్నారంటే.. ప్రజాసదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లం, వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు అభివృద్ధి, ప్రజల ముఖ్యం వైఎస్ రాజశేఖరరెడ్డి వెలుగు లాంటి వ్యక్తి అయితే, చంద్రబాబు చీకటి లాంటి వ్యక్తి. అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు అనేవి వైఎస్ కుటుంబానికి ఉంటే.. అవకాశాన్ని అందిపుచ్చుకుని తనూ, తన వారి శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు. రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం సరైంది కాబట్టే, చంద్రబాబు పుట్టిన గడ్డ నారావారిపల్లె ప్రజలు పాలన వికేంద్రీకరణకు మద్దతుగా నిలుస్తున్నారు. – సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం సలహాదారు (ప్రజా వ్యవహారాలు) చరిత్రను వక్రీకరించటంలో చంద్రబాబు దిట్ట సభలో మాట్లాడుతున్న సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. వేదికపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు చరిత్రను వక్రీకరించటంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దిట్ట. తన చాతుర్యం ప్రదర్శించి ఎదుటి వారిపై బురద చల్లడంలో నేర్పరి. రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ, రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు సరికదా కనీస చర్చకు కూడా ఆహ్వానించలేదు. అన్ని కమిటీలూ పాలనా వికేంద్రీకరణ చేయాలని సూచించాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు నీటి కోసం, కూటి కోసం అల్లాడుతుంటే.. అమరావతిలో రేట్లు.. రూ.కోట్ల కోసం ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉంది. – అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు, పాలనా వ్యవహారాలు నారావారిపల్లెపై ప్రేమ ఉంటే.. మాజీ సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక శాతమైనా నారావారిపల్లెపై ఉంటే ఈ గ్రామం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నిపుణులు కమిటీల సూచనలతో 3 రాజధానులు, 4 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చింది. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అందుకే చంద్రబాబును కుప్పం పంపారు నారావారిపల్లె చాలా మంచిది. ఇక్కడి ప్రజలు తెలివైన వారు. చంద్రబాబు మనస్తత్వం తెలియడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఓడించి కుప్పం నియోజకవర్గానికి పంపారు. – కె.నారాయణస్వామి, డిప్యూటీ సీఎం 15 ఏళ్లు సీఎంగా చేసినా.. చంద్రబాబు దాదాపు 15 సంవత్సరాలు సీఎంగా ఉన్నా రాయలసీమకు ప్రయోజనం దక్కకపోగా, సినిమాల ద్వారా విష ప్రచారం చేయించారు. సొంత జిల్లా చిత్తూరులో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. – భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే దమ్మున్న నాయకుడు జగన్ కులాలు, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమానికి ఇంత పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. – చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి -
సీఎం జగన్ దమ్మున్న నాయకుడు..
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
సాక్షి, చిత్తూరు : అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయకల్లాం మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ అనేదే సీఎం జగన్ ప్రభుత్వ సిద్ధాంతం అని, ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అలోచిస్తే.. చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకే చోట అభివృద్ధిని కోరుకుంటున్నాయని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కొంతమంది లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలను పెట్టించారని, దాని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలా చేయకుండా తమ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లి సక్సెస్ సాధించాయని తెలిపారు. రాజధాని సెంటర్లో ఉండాలని కోరుకోవడం తప్పు అని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే టీడీపీ సిద్ధాంతం అని విమర్శించారు. -
నారావారిపల్లిలో వికేంద్రీకరణ ప్రజా సదస్సు
-
నారావారిపల్లిలో వికేంద్రీకరణ ప్రజా సదస్సు
సాక్షి, చిత్తూరు: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయంపై ఆదివారం జిల్లాలోని చంద్రగిరి నారావారిపల్లిలో జరగనున్న ప్రజాసదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన నారావారిపల్లి సభా ప్రాంగణం వద్ద మాట్లాడుతూ.. రాజధాని మూడు విభాగాలుగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సదస్సుకు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా 25 వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారని ఆయన అన్నారు. దానికి అనుకూలంగా సభావేదిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. -
నారావారిపల్లిలో ఉద్రిక్తత
-
మేము అప్పుడు వెళ్లబట్టే.. ఇప్పుడు ఫ్యాషన్..
సాక్షి, తిరుపతి : ‘పదిహేనేళ్ల కిందట నా భార్య ప్రతి సంక్రాంతికి ఊరెళదామని పట్టుబట్టింది. అందుకు ఆమెకు కృతజ్ఞతలు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు పల్లెలకు వెళ్లటం ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉండే అలవాటు చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ పల్లెలకు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి నారావారిపల్లె వచ్చిన ఆయన మంగళవారమిక్కడ పుదిపట్ల నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్వగ్రామంలో 30 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిమెంట్ రోడ్ల వల్ల మోకాళ్ల నొప్పులొచ్చే ప్రమాదం ఉందని.. అందుకే మట్టిరోడ్లు కూడా అవసరమన్నారు. నారావారిపల్లెలో ఓల్డేజ్ హోంతో పాటు ఆస్పత్రి వద్ద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడి ఆస్పత్రిని స్విమ్స్‌తో అనుసంధానిస్తామని తెలిపారు. జీఏఎస్, జీపీఎస్ కింద ఉన్న నివాసాలన్నింటినీ మ్యాపింగ్ చేస్తామని సీఎం వెల్లడించారు. వాటి ద్వారా నివాస స్థలాలు, పక్కాగృహాలు లేని వారిని గుర్తించి గ్రామాల్లో 1+3 భవనాలు నిర్మించి ఇస్తామన్నారు. మామిడి ఎక్కువ సాగు చేస్తే ధరలు పడిపోయే అవకాశముందన్నారు. యానిమల్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పది రోజుల్లో హంద్రీ–నీవా పూర్తి చేసి నీళ్లిస్తా.. హంద్రీ–నీవా కాలువ పనులు పది రోజుల్లో పూర్తి చేసి మదనపల్లికి నీళ్లిస్తామని సీఎం చెప్పారు. ఆ తర్వాత పుంగనూరు, కుప్పం, పలమనేరు, చంద్రగిరి తదితర ప్రాంతాలకు నీళ్లు ఇస్తామన్నారు. చిత్తూరును కరువు రహిత జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. శ్రీ సిటీ కారణంగా అనేక పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. త్వరలో టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలతో సీఎంపై సామాన్యుడి ఫైర్ చంద్రగిరి: ‘మీరు పండుగ చేసుకుంటే సరిపోతుందా.. మరి మా సంగతేంటి?’ అంటూ సీఎం చంద్రబాబుపై ఓ సామాన్యుడు ఫైర్ అయ్యాడు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇష్టారీతిన ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం ఉదయం 9.45 నుంచి సుమారు మూడు గంటల పాటు రంగంపేట నుంచి నారావారిపల్లి మీదుగా కొత్తపేటకు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో వాహనాదారులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సహనం కోల్పోయిన పలువురు వాహనాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, పులిచెర్ల మండలం కొత్తపేటకు చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం నేరుగా సీఎం బస వద్దకు వెళ్లి ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడమే కాదు.. వాహనాదారుల ఇక్కట్లు కూడా గమనించాలి’ అంటూ మండిపడ్డాడు. మీరు మాత్రమే పండుగ చేసుకుంటే సరిపోతుందా? మేము చేసుకోవద్దా..? అంటూ సీఎంను నిలదీశాడు. -
నారావారిపల్లిలో పొట్టేళ్ల ఫైట్
-
నారావారి ఇంట సంక్రాంతి సంబరాలు
-
నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు
నారావారిపల్లి(చంద్రగిరి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు శుక్రవారం సాయంత్రం స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికి నవ్వుతూ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఆయన మూడు రోజుల పాటు గ్రామంలోనే బస చేయనున్నారు. ఇప్పటికే సీఎం సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా రోహిత్, దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తెలు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నారావారిపల్లిలో చేరుకున్నారు. శనివారం ఉదయం సీఎం తన తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికినా వారిలో మంత్రి నారాయణ, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, సుగుణమ్మ, చంద్రగిరి జెడ్పీటీసీ సభ్యులు సరితా రమణమూర్తి, శ్రీధర్ వర్మ, కేశవులనాయుడు, సర్పంచ్ పాశం చంద్రకుమార్‌నాయుడు తదితరులు ఉన్నారు. -
పోలీస్‌లు కూంబింగ్ : ఎర్రచందనం దుంగల స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా నారావారిపల్లె సమీపంలో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ. 20 విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ఘటనా స్థలానికి చేరుకుని... పరిశీలించారు. నారావారిపల్లె సమీపంలో తరచుగా ఎర్రచందనం దుంగలు పట్టుబడటంపై డీఐఈ కాంతారావు విచారణ జరుపుతున్నారు. -
రేషన్ కార్డు కోసం నారావారిపల్లె దాకా...
జాతీయ జెండాతో చంద్రబాబు స్వగ్రామానికి న్యాయవాది పాదయాత్ర ఒంగోలు క్రైం: తనకున్న రేషన్ కార్డును తొలగించారంటూ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన న్యాయవాది వి.గజేంద్రరావు వినూత్నంగా నిరసన చేపట్టారు. వేటపాలెం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు. జాతీయ జెండాకు తన ఆవేదనను వినతి పత్రం రూపంలో సమర్పించి అదే జాతీయ జెండాను భుజాన వేసుకొని పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం ఉదయం వేటపాలెంలో బయలుదేరిన గజేంద్రరావు సోమవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. రేషన్‌కార్డు తొలగింపుపై పలుమార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. చీరాల డీఎస్పీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. జన్మభూమి గ్రామసభలో అర్జీ ఇస్తానని చెప్పగా అర్జీ ఇస్తే అరెస్టు చేస్తానని డీఎస్పీ బెదిరించారన్నారు. తన రేషన్‌కార్డు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని, రద్దు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాదయూత్ర చేస్తున్నట్లు గజేంద్రరావు తెలిపారు. -
బాబు సొంతూరులో అధికారులకు చుక్కెదురు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో అధికారులకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి బంధువే అధికారులను నిలదీశారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులు నారావారిపల్లికి వెళ్లారు. సీఎం సమీప బంధువు నాగరాజు నాయుడు తనకు రుణమాఫీ కాలేదని అధికారులను నిలదీశారు. 40 వేల రూపాయలు అప్పు ఉంటే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఏకరవు పెట్టారు. ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు సొంత ఊర్లో, సమీప బంధువుకే రుణమాఫీ కాకపోవడం గమనార్హం. -
ఎర్ర అడ్డా..నారావారి గడ్డ !
► ఎర్రస్మగ్లింగ్‌కు అడ్డాగా నారావారిపల్లె ► సీఎం ఇంటికి కూతవేటు దూరం నుంచే దుంగల తరలింపు ► చంద్రగిరికోట ప్రాంతాన్నీ అక్రమాలకు వాడుకుంటున్న పచ్చనేతలు ► ఎర్ర వాహనాలకు పైలట్లుగా చంద్రగిరి, పాకాల నేతలు ► సచ్చినోడిబండ ప్రాంతం నుంచే భారీగా ఎర్రస్మగ్లింగ్ సీఎం చంద్రబాబునాయుడు స్వగ్రామమయిన నారావారిపల్లె ఎర్రచందనం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆయ న ఇంటికి సమీపంలోని ఓ తోటనే పచ్చనేతలు డంపింగ్ యార్డుగా మార్చేశారు. శేషాచలం అడవుల నుంచి తెచ్చే దుంగల్ని ఇక్కడే దాచిపెట్టి.. రాత్రికిరాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా పాకాల, చంద్రగిరి నేతలు పెలైట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తనిఖీలు చేసేందుకూ పోలీసులు సాహసించడం లేదు. ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు.. ‘సాక్షి’టాస్క్‌ఫోర్స్ బృందం సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె ఎర్రస్మగ్లింగ్‌కు కేంద్రబిందువుగా మారింది. కొందరు ‘పచ్చ’బాబులు స్మగ్లర్ల అవతారమెత్తి దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిత్యం వందల టన్నుల ఎర్రదుంగల్ని సరి హద్దులు దాటించి సొమ్ముచేసుకుంటున్నా రు. దీన్ని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నా యి. ఇదేఅదునుగా కొందరు రెచ్చిపోతున్నా రు. సీఎం నివాసానికి అతి సమీపం నుంచే దుంగల్ని దాచి స్మగ్లింగ్‌కు సిద్ధపడుతున్నారు. అక్కడే ఉన్న ఓ తోటను హాల్ట్, లిఫ్టింగ్ పాయింట్‌గా మార్చేశారు. రాచబాటగా నారావారిపల్లె నారావారిపల్లె ఎర్రస్మగ్లింగ్‌కు రాచబాటగా మారింది. టీవల అదేగ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుని ఇంటి పక్కనే ఉన్న తులసిపెంటలో రూ.కోటి విలువజేసే 40 దుంగలు దొరికాయి. అంతకుమునుపు గ్రామానికి సమీపంలో తరలింపునకు సిద్ధంగా ఉంచిన రూ.70 లక్షల విలువైన 30 దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ కేసుల్ని పోలీసులు అటకెక్కించారు. అంతా గుట్టుగానే.. నారావారిపల్లెలో చోటు చేసుకుంటున్న అక్రమాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. కూలీలు దుంగల్ని కళ్యాణి డ్యామ్ నుంచి చెక్‌పోస్టు సమీపంలోని అండర్‌బ్రిడ్జి మార్గం మీదుగా తులసిపెంట వైపు మోసుక్తొసారు. వీటిని టీడీపీ కార్యాలయ సమీపంలో, చంద్రబాబు ఇంటికి సమీపంలోని తోటల్లో ఉన్న గంతల్లో నిల్వ చేస్తున్నారు. ఆపై వాహనాల్లో భీమవరం నుంచి కొత్తపేట - బందార్లపల్లె - పూతలపట్టు మీదుగా చెన్నైకి తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వగ్రా మం కావడంతో అధికారులు దాడులు చేసేందుకు సాహసించడంలేదు. పైగా ఆ గ్రామానికి చెడ్డపేరు వస్తుందని వెనుకడుగు వేస్తున్నట్టు కొందరు బాహాటంకంగా చెబుతున్నారు. డంపింగ్ కాదు హాల్టింగ్ ఎర్ర దుంగలను డంపింగ్ చేసే స్మగ్లర్లు ఇప్పుడు రూటుమార్చారు. గతంలో నరికిన దుంగలను అడవిలోనే డంపింగ్ చేసేవారు. కానీ కొంతకాలంగా ఆయుధాలతో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తుండడంతో డంపింగ్‌లతో లాభంలేదని గుర్తించినట్టుంది. ఎప్పుడు నరికిన దుంగలను అప్పుడే అడవి నుంచి తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాహనం వచ్చే సమయం వరకు కొన్ని ప్రాంతాలను హాల్టింగ్లుగా ఎంపిక చేసుకొంటున్నారు. ఇందుకు రాయలవారి చంద్రగిరి కోట ప్రాంతాన్నీ వదలడంలేదు. శేషాచలం అటవీ సరిహద్దుప్రాంతాలైన నెరబైలు, దేవరకొండ, ఏనుగుపాదం, కళ్యాణిడ్యాం, రంగంపేట, టేకుప్లాంట్, నారావారిపల్లె, చంద్రగిరికోట ప్రాంతాలను హాల్టింగ్ కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. అలాగే అడవి నుంచి తీసుకొచ్చే దుంగలను రంగంపేట సమీపంలోని కాలిబాట గుండా టేకుప్లాంటు, నాగయ్యగారిపల్లె మీదుగా కోట వెనుక వైపు ఐతేపల్లెకు సమీపంలోకి చేర్చుతున్నారు. దుంగలు పోగయ్యాక వాహనంలోకి ఎక్కించి చిత్తూరు మార్గంగుండా చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారు. శేషాచలం నుంచి రంగంపేట మీదుగా నారావారిపల్లె, శేషాపురం, చిన్న రామాపురం, భీమవరం, మూలపల్లె, కొమ్మిరెడ్డిగారిపల్లె మీదుగా పాకాల, పూతలపట్టు పరిసరాల్లోని డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగినా.. గతంలో సచ్చినోడిబండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళ కూలీలు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎర్రచందనం దుంగల తరలింపు కొంతవరకు ఆగుతుందని అందరూ భావించారు. కానీ ఏమాత్రం ఆగడంలేదు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత సుమారు రూ.30 కోట్ల విలువైన దుంగలు పట్టుబడడం పోలీసుల వైఫల్యానికి అద్దంపడుతోంది. సురక్షితమైన గేట్వేగా పడమటి ప్రాంతం పడమటి ప్రాంతం ఎర్రచందనం తరలించేందుకు సురక్షితమైన గేట్వేగా మారింది. వైఎస్సార్ జిల్లా నుంచి అనంతపురం జిల్లా కదిరి మీదుగా వచ్చే ఎర్రచందనం వాహనాలకు ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, మదనపల్లె మండలాల మీదుగా వెళ్తుంటాయి. ఆయా ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో నిఘా లేకపోవడం స్మగ్లర్లకు కలిసొస్తోంది. ములకలచెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం వరకు భారీగా ఎర్రచందనం పట్టుబడింది. కానీ ఇప్పుడు ఆ జాడేలేదు. పెద్దమండ్యం మండలం నుంచి తంబళ్లపల్లె, ములకలచెరువు మీదుగా పెద్దతిప్పసముద్రం మండలంలోని చేలూరు, మల్లెల, పట్టెంవాండ్లపల్లె మీదుగా వాహనాలు దర్జాగా కర్ణాటకలోకి వెళ్తున్నాయి. వీటిని అరికట్టడంలో అధికారులు విఫలమవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఆ మామిడితోపు సరిహద్దులో.. భాకరాపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ టీడీపీ నేత మామిడితోపు ఉంది. ఈ పరిసరాలు ఎర్ర స్మగ్లర్లకు అడ్డాగా మారుతున్నాయి. శేషాచలం అడవుల్లోంచి తరలించిన దుం గలను ఈ ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. ఇక్కడ ఏ ర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు గుండా రాత్రిపూట వాహనాల్ని నేరుగా డంపింగ్ యార్డుకు రప్పిం చి ఎర్రదుంగల్ని లోడ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసు లు జరిపిన దాడుల్లో ఇక్కడ సుమారు రూ.40 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. బోడిరెడ్డిగారిపల్లె జంక్షన్ పాయింట్ చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని బోడిరెడ్డిగారిపల్లె స్మగ్లర్లకు కేంద్రబిందువుగా మారింది. అడవి నుంచి సుమారు 15 కి.మీ కాలిబాట ఉంది. ఇదే మార్గంలో కూలీలచేత అడవి నుంచి దుంగలు తీసుకొచ్చి డపింగ్ ప్రాంతాలకు చేర్చుతున్నారు. ఇక్కడ ఉన్న కూడలి నుంచి ఓ వైపు చిట్టేచర్ల మీదుగా భాకరాపేటకు, మరో మార్గం ఎర్రావారిపాళెం మీదుగా వెళ్తున్నాయి. అలాగే చింతకుంట, నెరబైలు మీదుగా బోడేవాండ్లపల్లె, ప్రసాద్‌నగర్, యల్లమంద మీదుగా పీలేరు సమీపంలోని జాతీయ రహదారిలో కలసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, చెన్నైకి సులువుగా చేరుకునేందుకు అవకాశం కలుగుతోంది. ఎర్రావారిపాళెం మండలంలోని కొన్ని గ్రామాల నుంచి ఎర్రచందనం దుంగల్ని బ్యాగుల్లో కుక్కి బెంగళూరుకు చేరవేస్తున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాలే షెల్టర్ జోన్లు శేషాచలం అడవి నుంచి తీసుకొచ్చే దుంగలను అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాకుండా డంప్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చిట్టేచర్ల, చింత గుంట, బోడేవాండ్లపల్లె, నెరబైలు, కోటకాడపల్లె, ఉస్తికాయలపెంట, జిల్లేళ్లమంద, బసన్నగారిపల్లె, నూతనకాలువ, ఫించా, బసన్నగారిపల్లె, తిరుపతి రూరల్ మండలంలోని దళవాయి చెరువు, చంద్రగిరి మండలం రంగంపేట, శ్రీవారిమెట్టు, మూలపల్లె, కళ్యాణిడ్యాం ప్రాంతాలు షెల్టర్జోన్లుగా ఉన్నాయి. పింఛా టు బెంగళూరు చిత్తూరు-వైఎస్సార్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రావారిపాళెం, కేవీపల్లె, సంబేపల్లె, సుండుపల్లె మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలను పింఛా పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ తర్వాత పింఛా పరీవాహక ప్రాంతాల్లో దుంగల్ని పూడ్చిపెడుతున్నారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా నూతనకాల్వ, గుండ్రేవారిపల్లె క్రాస్ మీదుగా కడప-చిత్తూరు మార్గం చేరుకుని కలికిరి, అంగళ్లు మీదుగా చీకలబైలు నుంచి కర్ణాటక సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు. -
'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది'
-
'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది'
నారావారిపల్లె: అమరావతికి స్థాన, వాస్తు బలం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 'మన మట్టి-మన నీరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం చేస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో 'మన మట్టి-మన నీరు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. పవిత్ర భావనతో, అందరి మనోభావాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీరుతో పాటు సంకల్ప పత్రాలు సేకరిస్తామని వెల్లడించారు. అందరి సంకల్పంతో రాజధాని కట్టుకోవాల్సిన అవసరముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. -
స్వగ్రామంలో సీఎం సంబరాలు
ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముక్తసరి ప్రసంగం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారి పల్లెలో బుధవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి పండుగ సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన బాబు.. దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత చంద్రబాబు తల్లిదండ్రులు.. అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు సమాధులకు పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉండడం వల్ల తాను ఏమీ మాట్లాడలేనని పేర్కొంటూ సీఎం ముక్తసరిగా ప్రసంగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల జీవితాల్లో ఈ సంక్రాం తి.. సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంతో ముచ్చటించారు. సంబరాల్లో పాల్గొన్న విద్యుత్ కార్మికుల విశ్రాంత సంఘం నేతలు తమ సంఘం తరఫున రూ.1.11 కోట్ల డీడీని హుద్ హుద్ తుపాను బాధితుల సాయం కోసం సీఎంకి అందజేశారు. తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా టీడీపీ కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం. సుగుణమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, జిల్లాలో టీడీపీ పరిస్థితిపై వారితో సమీక్షించారు. దివంగత వెంకటరమణ భార్య సుగుణమ్మనే ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిగా దించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అనంతరం తిరుపతి టీడీపీ అభ్యర్థి ఎం. సుగుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ.. తన భర్త దివంగత వెంకటరమణ ఆశయాలకోసం పనిచేస్తానన్నారు. ఉప ఎన్నికలో తనకు సహకరించాలని, అన్ని పార్టీలను కోరనున్నట్లు తెలిపారు. నేడు మంత్రి బొజ్జలకు సీఎం పరామర్శ ఇటీవల పితృ వియోగం చెందిన రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీఎం పరామర్శిం చనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు నారావారి పల్లె నుంచి హెలీ కాప్టర్లో బయలుదేరి మంత్రి బొజ్జల స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరుకు చంద్రబాబు చేరుకుంటారు. కొద్దిసేపు బొజ్జలను పరామర్శించనున్నారు. అనంతరం, అదే హెలీకాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, బెంగళూరు మీదుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.