నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు | CM Chandrababu In naravaripalli | Sakshi
Sakshi News home page

నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు

Published Sat, Jan 14 2017 1:31 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు - Sakshi

నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు

నారావారిపల్లి(చంద్రగిరి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు శుక్రవారం సాయంత్రం స్వగ్రామమైన నారావారిపల్లికి  చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికి నవ్వుతూ ఆయన  సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఆయన మూడు రోజుల పాటు గ్రామంలోనే బస చేయనున్నారు. ఇప్పటికే సీఎం సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా రోహిత్, దివంగత నేత ఎన్టీఆర్‌ కుమార్తెలు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నారావారిపల్లిలో చేరుకున్నారు.

శనివారం ఉదయం సీఎం తన తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికినా వారిలో మంత్రి నారాయణ, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, సుగుణమ్మ, చంద్రగిరి జెడ్పీటీసీ సభ్యులు సరితా రమణమూర్తి, శ్రీధర్‌ వర్మ, కేశవులనాయుడు, సర్పంచ్‌ పాశం చంద్రకుమార్‌నాయుడు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement