రేషన్ కార్డు కోసం నారావారిపల్లె దాకా... | Lawyer walk to naravaripalli for ration card | Sakshi
Sakshi News home page

రేషన్ కార్డు కోసం నారావారిపల్లె దాకా...

Published Tue, Jan 5 2016 10:32 AM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM

రేషన్ కార్డు కోసం నారావారిపల్లె దాకా... - Sakshi

రేషన్ కార్డు కోసం నారావారిపల్లె దాకా...

జాతీయ జెండాతో చంద్రబాబు స్వగ్రామానికి న్యాయవాది పాదయాత్ర
 

ఒంగోలు క్రైం: తనకున్న రేషన్ కార్డును తొలగించారంటూ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన న్యాయవాది వి.గజేంద్రరావు వినూత్నంగా నిరసన చేపట్టారు. వేటపాలెం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు.  జాతీయ జెండాకు తన ఆవేదనను వినతి పత్రం రూపంలో సమర్పించి అదే జాతీయ జెండాను భుజాన వేసుకొని పాదయాత్ర ప్రారంభించారు.

ఆదివారం ఉదయం వేటపాలెంలో బయలుదేరిన గజేంద్రరావు సోమవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. రేషన్‌కార్డు తొలగింపుపై పలుమార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. చీరాల డీఎస్పీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. జన్మభూమి గ్రామసభలో అర్జీ ఇస్తానని చెప్పగా అర్జీ ఇస్తే అరెస్టు చేస్తానని డీఎస్పీ బెదిరించారన్నారు. తన రేషన్‌కార్డు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని, రద్దు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాదయూత్ర చేస్తున్నట్లు గజేంద్రరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement