ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరీమణులు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, కుమారుడు లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్, చంద్రబాబు తమ్ముడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తదితరులు రెండు రోజులకు ముందే నారావారిపల్లెకు చేరుకున్నారు.