Naravaripalle
-
సీఎం చంద్రబాబును కలవాలంటూ యశోదమ్మ అనే మహిళ నిరసన
-
న్యాయం కోసం చంద్రబాబు దగ్గరికి వస్తే..
తిరుపతి రూరల్: అయ్యా.. నా పరిశ్రమను నాశనం చేశారని, నాపై దౌర్జన్యం చేసి జాకెట్‌ను సైతం చించేశారు, పోలీసులు కూడా నాపై దాడిచేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు, ముఖ్యమంత్రిగారికి నా బాధ చెప్పుకుంటానయ్యా.. అంటూ వచ్చింది ఓ మహిళ. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన మీద వచ్చారని, ఎవరినీ కలవరంటూ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో జరిగిందీ ఘటన. .. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు, సరోజినిదేవి దంపతుల నుంచి కొంతభూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు రూ.కోటి ఖర్చుతో ఎల్వీ పవర్‌లూమ్స్, హ్యాండ్లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హాథీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యాజమానులమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఉన్నా రాజేశ్వరరావు, మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్ను ఖాళీచేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. రూ.50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్నా సామగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడిచేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచి్చన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యశోద.. నారావారిపల్లికి వచ్చి సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఏడుస్తూ.. ఆమె రోడ్డుపై బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పగులుగొట్టుకుని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. ఆమెను ఆపి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.మీడియాపైనా దౌర్జన్యం..ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫోన్లు, కెమెరాలను లాక్కుని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్రాంతి పండగకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబు అక్కడా రాజకీయ ప్రసంగాలే చేశారు. భోగి మంట వేయడానికి అని చెప్పి వేకువజామునే రోడ్డుపైకి వచ్చి జీవో నంబర్ 1 ప్రతులను తగులబెట్టారు. మూడేళ్ల తరువాత స్వగ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన.. శనివారం మీడియా సమావేశంలో అర్థంపర్థం లేకుండా మాట్లాడారు. జీ–20 సదస్సుల్లో ప్రధాని మోదీకి తాను సలహా ఇచ్చానని చెప్పిన చంద్రబాబు.. ఆ సలహా ఏమిటో చెప్పలేదు. ‘అదే 2047.. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం. రాబోయే 2047కు ప్రపంచంలోనే తెలుగు జాతిని నంబర్–1గా నిలుపుతాను. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ స్థిరపడడానికి నేనే కారణం...’ అంటూ అర్థంలేకుండా మాట్లాడారు. టెక్నాలజీ శక్తి ఉండడంతో 2047 వరకు యువత మనకు అండగా ఉంటుందని, ఆ తర్వాత మన యువత తగ్గిపోతుందన్నారు. దేశ భవిష్యత్తు కోసం పిల్లలను కనడం మన ధర్మమని చెప్పుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా జాతీయ రహదారిని తానే ఏర్పాటు చేశానని చెప్పారు. చదవండి: బెజవాడ సైకిల్‌కు టెన్షనెందుకు? -
నారావారిపల్లెలో TDP ఘోర పరాజయం
-
సీఎం జగన్ దమ్మున్న నాయకుడు..
సాక్షి, చిత్తూరు : అధికార వికేంద్రీకరణతోనే ఆంధప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాసదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. నారావారిపల్లె పరిసర ప్రాంతాల్లో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. ‘తుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో (2007, 08) నారావారి పల్లెలో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఈ ఏడు నెలల్లోనే రూ.12 కోట్లతో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు చేశాము. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇంతమంది నేతలు నారావారి పల్లెకు వచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. సీఎం జగన్మోహన్రెడ్డి దమ్మున్న నాయకుడు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులు మా పార్టీలో లేరు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నరు కాబట్టే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో ప్రజానీకం హాజరయ్యారు.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యంమంత్రి వైఎస్సార్ వెలుగులాంటి వ్యక్తిఅని కొనియాడారు. వెలుగు లాంటి వ్యక్తి వైఎస్సార్ అయితే.. చంద్రబాబు నాయుడు చీకటి లాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ అడుగు జాడలోనే సీఎం వైఎస్ జగన్ నడుస్తున్నారని అన్నారు. నమ్మిన సిద్ధాంతాకు కట్టుబడి పనిచేసే వ్యక్తి జగన్ అని ప్రశంసిచారు. మాట ఇస్తే మడమతిప్పని వ్యక్తి అని కానియాడారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
పల్లెకు పర్యాటకశోభ
నారావారిపల్లి(తిరుపతి రూరల్): రాష్ట్రంలో విలేజ్, వ్యవసాయ పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. çసంప్రదాయ టూరి జంనే కాకుండా గ్రామస్థాయిలో పర్యాటకం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణవాసులు సెలవుల్లో పల్లె వాతావరణంలో సేదతీరేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే గాలేరు–నగరి రెండోదశ పనులను ప్రారంభిస్తామన్నారు. గాలేరు–నగరి నీటిని కల్యాణి డ్యామ్‌కు తప్ప క తీసుకువస్తామన్నారు. వైకుంఠమాల పేరుతో బాలాజీ రిజర్వాయర్– మల్లిమడుగు–కృష్ణాపురం రిజర్వాయర్లను అనుసంధానం చేసి సిటీ ఆఫ్ ట్యాంక్స్‌గా జిల్లాను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికి ప్రతి నెలారూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రామాల్లో పశువులకు హాస్టల్స్, గ్రామాల్లోనే గార్మెంట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా నారావారిపల్లెలోనే వీటిని ప్రారంభిస్తామని ఆ దిశగా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత లేదన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడం వల్ల అవినీతి, దుర్వినియోగం తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాల్గవ విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమం బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు. నాలుగు గంటలు ఆలస్యంగా కార్యక్రమాలు సీఎం సమయపాలన పాటించకపోవడంవల్ల ఆదివారం ఆయ న కార్యక్రమాలు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పీహెచ్‌సీని 30పడకల ఆసుపత్రిగా మార్చేం దుకు నిర్వహించాల్సిన శంకుస్థాపన ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సింది. అయితే సీఎం ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 12గంటలకు జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 7.50 గంటలకే వచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడే నాలుగు గంటలపాటు నిరీక్షించారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా వచ్చిన సీఎం అందరి నుంచి అర్జీలు తీసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. -
నారావారి ఇంట సంక్రాంతి సంబరాలు
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరీమణులు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, కుమారుడు లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్, చంద్రబాబు తమ్ముడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తదితరులు రెండు రోజులకు ముందే నారావారిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు... తమ కులదైవం నాగులమ్మ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. మరోవైపు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఈ పొట్టేళ్ల పోటీ జరిగింది. తాడోపేడో తేల్చుకునేందుకు బరిలో కాలు దువ్వాయి. చుట్టూ జనం చప్పట్లు ఈలలు వేస్తూ సందడి చేస్తుంటే రెండు పొట్టేళ్లు ఢీ కొట్టాయి. -
నారావారి ఇంట సంక్రాంతి సంబరాలు
-
డిజిటల్ 'బాబు' సొంతూర్లో ఏటీఎం ఉందా?
తిరుపతి : నగదు రహిత లావాదేవీల ద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీగా ఎలా మార్చాలో చెప్పుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వగ్రామాన్నే గాలికొదిలేశారు. సీఎం స్వగ్రామం నారావారిపల్లిలో కనీసం బ్యాంకు కార్యాలయమే కాక, ఒక్క ఏటీఎం కూడా లేదు. నారావారిపల్లికి పక్కనున్న డజను గ్రామాలది ఇదే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ నోట్ల కోసం ఆ గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి చంద్రగిరి లేదా తిరుపతిలో పనిచేసే ఏటీఎంల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అక్కడ స్వైపింగ్ మిషన్లూ పనిచేయడం లేదు. కేవలం ఒక్క రేషన్ దుకాణదారుడు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో సబ్సిడీ బియ్యాన్ని, ఇతర నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్నాడు. నారావారిపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో రంగంపేటలో ఏటీఎం ఉన్నా.. అది ఉండీ లేనిమాదిరిగా తయారైంది. కనెక్టివిటీ సమస్యతో అది పనిచేయడం లేదు. ఓ వైపు తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 104వ ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులు ప్రసంగాల మీద ప్రసంగాలు ఇస్తున్నారు. ఆ వేదికకు కొద్దీ దూరంలోనే స్వయానా సీఎం స్వగ్రామం నారావారిపల్లినే టెక్నాలజీకి ఆమడదూరంలో పయనం సాగిస్తుండటం విడ్డూరం. -
నారావారిపల్లె నుంచి రథయాత్ర
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర కర్నూలు(అర్బన్): రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతిస్తే నారావారిపల్లె నుంచి మాదిగ చైతన్య రథయాత్రను తిరిగి కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సుభాష్ చంద్రమాదిగ తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా రూపొందించామన్నారు. స్థానిక కోల్స్ కళాశాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందని, హైకోర్టు ధర్మాసనం రథయాత్రను నారావారిపల్లె నుంచి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుడు బి. నరసింహులు మాదిగ మాట్లాడుతూ ఏప్రిల్ 30న విజయవాడలో మాదిగల విశ్వ రూప మహాసభ జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 నుంచి మాదిగల చైతన్య రథయాత్ర మంద కృష్ణ నాయకత్వంలో కొనసాగుతుందన్నారు. నారావారిపల్లె నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో టౌన్ ఇన్చార్జీ రవి, గౌరవ సలహాదారు తిమోతీ, కల్లూరు మండలాధ్యక్షుడు కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. -
నారావారిపల్లెలో కట్టుదిట్టమైన భద్రత
చంద్రగిరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నారావారిపల్లెకు వస్తుండటంతో రాక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి గురువారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈ మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి నారావారిపల్లెకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం నివాసం, తల్లిదండ్రుల సమాధి, టీటీడీ కల్యాణ మండపం వద్ద తనిఖీలు చేపట్టారు. కాగా సీఎం వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ బుధవారం రాత్రి నారావారిపల్లెకు చేరుకున్నారు. భద్రతపై అధికారుల సమీక్ష రేణిగుంట: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతపై విమానాశ్రయంలో అధికారులు సమీక్షించారు. సీఎం గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుని ఇక్కడి నుంచి నారావారిపల్లెకు వెళతారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశుక్లా, విమానాశ్రయ అధికారులు సమీక్ష నిర్వహించారు. కాన్వాయ్ ట్రయల్ రన్ సక్సెస్ తిరుపతి క్రైం: గురువారం సీఎం ప్రయా ణించే మార్గాల్లో బుధవారం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి రోడ్డులో ఉన్న మానససరోవరం, అక్కడినుంచి అలిపిరి, జూపార్కు, చెర్లోపల్లి మీదుగా నారావారిపల్లె వరకు నిర్వహించిన ట్రయల్న్ర్లో కలెక్టర్ సిద్ధార్థజైన్, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, నగరపాలక కమిషనర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు. -
14న నారావారిపల్లెకు సీఎం రాక
చిత్తూరు (అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14న నారావారిపల్లెకు రానున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14న మధ్యాహ్నం 3.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్ర యం చేరుకుంటారు. అక్కడ నుంచి 4.10 గంటలకు బయలుదేరి తిరుపతి-కరకంబాడి రోడ్డులో హోటల్ మానస సరోవర్ చేరుకుంటారు. ఇక్కడ మానససరోవర్ ప్రీమియంను, సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభిస్తారు. 5.50 గంటలకు నారావారిపల్లెకు చేరుకుని బస చేస్తారు. 15న నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 16న ఉదయం 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు. -
నారా వారి ఇంట సంక్రాంతి సంబరాలు
కళాకారులతో కలసి ఉల్లాసంగా గడిపిన బాబు తుపాను బాధితులకు విరాళాల వెల్లువ చంద్రగిరి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలసి కాసేపు కోలాటం, చెక్కభజన చేశారు. ఉదయం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి నారా కుటుంబీకులు, నందమూరి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. బాబు వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, నందమూరి రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం సినీ నటుడు నారా రోహిత్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యేలు గాలిముద్దుకృష్ణమనాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, చిత్తూరు మేయర్ అనురాధ, తదితరులు చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు శ్రీధర్ వర్మ, కర్నాటక టీఎన్ఎస్ఎఫ్ ఇన్చార్జి రవినాయుడు భారీ కేక్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం విశ్రాంతి విద్యుత్ ఉద్యోగులు ఒక కోటి 11 లక్షల 751 రూపాయలు, యాదమర్రి మండలం నుంచి 3లక్షల 60వేలు, తిరుపతి శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ డి.వెంకటేశ్వర్లు, కంపెనీ తరపున ఒక లక్ష 11వేల 111 రూపాయలు, తిరుమల తిరుపతి హోటల్ అసోసియేషన్ వారు 5లక్షల 85వేల రూపాయలను అందించారు. తిరుపతి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్‌లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సహస్ర చండీయాగం బ్రోచర్‌ను ప్రారంభించారు. సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పులుగోరు మురళి తిరుపతి ఉప ఎన్నికల్లో సుగుణమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని తాము స్వాగతిస్తున్నామని తిరుపతి కోఆపరేటివ్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి చంద్రబాబుకు తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం వల్ల కొందరు నాయకులు స్వలాభం కోసం పత్రికల్లో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. -
సొంత ఊళ్లో చంద్రబాబు, ఫాంహౌస్‌లో కేసీఆర్
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన స్వగ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటే తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆయన బుధవారం సాయంత్రం ఫాంహౌజ్ కు వెళ్లనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు బుధవారం సొంత ఊరైన నారావారిపల్లిలో సందడి చేశారు. సంక్రాంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఆయన...కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చేశారు. అనంతరం ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరి వారికి నివాళి అర్పించారు. నారావారిపల్లె చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుకు వినతిపత్రాలు సమర్పించడాని పోటీపడ్డారు. దీంతో భద్రత సిబ్బంది వారిని అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. -
నారావారిపల్లె ముస్తాబు
చంద్రగిరి: సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భం గా స్వగ్రామం నారావారిపల్లెకు రానున్నారు. ఇందుకోసం జిల్లా అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం కలెక్టర్ సిద్ధార్థ జైన్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాం తి సందర్భంగా సీఎం మూడు రోజుల పర్యటన ఉంటుందన్నారు. తిరుపతి లోని పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారని తెలిపారు. దీంతో నారావారిపల్లిలో కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం రాక నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యే లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ చేరుకునే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తగా భోజన ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది దాకా రావచ్చని అంచనా వేశామన్నారు. టీటీడీ కల్యాణమండపం సమీపంలో భోజన ఏర్పాట్లకు స్థలాన్ని ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, చంద్రగిరి ఎంపీడీవో డాక్టర్ వెంకటనారాయణ, తహశీల్దార్ కిరణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సింగపూరు కలలతో నారావారి పల్లె కడుపు నిండుతుందా?
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరడం అంటే ఏమిటో చంద్రబాబునాయుడు వాగ్దానాలను చూస్తే తెలుస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీమాంధ్రను సింగపూర్ చేసేస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా, ఇరవై ఏళ్లు అధికార పార్టీ ముఖ్యనేతగా ఉన్నా సొంత ఊరు నారావారిపల్లిని మాత్రం ఏమీ చేయలేకపోయారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న బాబు ఏనాడూ తమని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఆ ఊరి ప్రజలు. సొంత గ్రామంలో పూరి గుడిసెలు వెక్కిరిస్తుంటే, సింగపూర్‌ను సీమాంధ్రకి తెస్తానంటే ఎలా నమ్మేది అంటున్నారు నారావారిపల్లె గ్రామస్తులు. ఎటు చూసినా పూరి గుడిసెలతో కనిపిస్తుంది నారావారిపల్లె దళితవాడ. నారావారిపల్లెలోని దళితులు 30 ఏళ్లుగా పక్కా గృహాలకు నోచుకొలేక పోయారు. ఎపక్కా గృహాలు మంజూరు చేయించాలని ఎన్నొసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నది లేదని వారంటున్నారు. దాదాపు తెలుగు దేశం పార్టీ పుట్టినప్పుడు తాము నారావారిపల్లెకు వచ్చామని దళిత వాడ నివాసులు తెలిపారు. మూడు దశాబ్ధాలు దాటినా ఇప్పటికీ సొంతింటికి నోచుకోలేకపోయామని వారరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారావారిపల్లిలో ఓ చక్కటి సిమెంట్ రోడ్డు వుంది. ఈ రోడ్డు కూడా చంద్రగిరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుడా చైర్మెన్‌గా ఉన్నప్పుడు వేసింది. తుడా చైర్మెన్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నారావారి పల్లె అభివృద్దికి కృషి చెశారు. కాని చంద్రబాబునాయుడు మాత్రం సింగపూరు కబుర్లతో నారావారిపెల్లె కడుపు నింపుతున్నారని ఆ గ్రామస్తులు అంటున్నారు.