నారావారి ఇంట​ సంక్రాంతి సంబరాలు | Chandrababu naidu and his family celebrates sankranti in Naravaripalle | Sakshi
Sakshi News home page

నారావారి ఇంట​ సంక్రాంతి సంబరాలు

Published Sat, Jan 14 2017 2:21 PM | Last Updated on Fri, Jul 6 2018 3:37 PM

నారావారి ఇంట​ సంక్రాంతి సంబరాలు - Sakshi

నారావారి ఇంట​ సంక్రాంతి సంబరాలు

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరీమణులు లోకేశ్వరి, ఉమామహేశ్వరి,  కుమారుడు  లోకేశ్‌, బ్రహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్, చంద్రబాబు తమ్ముడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తదితరులు రెండు రోజులకు ముందే నారావారిపల్లెకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు... తమ కులదైవం నాగులమ్మ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. మరోవైపు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఈ పొట్టేళ్ల పోటీ జరిగింది. తాడోపేడో తేల్చుకునేందుకు బరిలో కాలు దువ్వాయి. చుట్టూ జనం చప్పట్లు ఈలలు వేస్తూ సందడి చేస్తుంటే రెండు పొట్టేళ్లు ఢీ కొట్టాయి.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement