ప్రకృతి వ్యవసాయం నేనే ప్రారంభించా
ప్రతి ఇంట్లో విద్యుత్ ఉత్పత్తి చేయిస్తా
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు
తిరుపతి రూరల్/చంద్రగిరి: దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని తానే ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం నారావారిపల్లె పర్యటనలో భాగంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. స్వర్ణ నారావారిపల్లె విజన్ తీసుకువస్తున్నామని వెల్లడించారు. అన్నీ నేనే చేశా.. అన్నీ నేనే చేస్తానంటూ హామీలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
⇒ ప్రకృతి సేద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లోనే కుప్పంలో నేనే ప్రారంభించా.
⇒ నారావారిపల్లె పరిధిలోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాల ని కలెక్టర్‌కు సూచించా.
⇒ శ్రీసిటీ సౌజన్యంతో రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు, ఏఐ టెక్నాల జీ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం.
⇒ ఫిబ్రవరి లోపు వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం.
⇒ జల్ జీవన్ మిషన్ కింద రక్షిత మంచినీరు నిరంతరం అందిస్తాం.
⇒ ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయిస్తాం.
⇒ రంగంపేట నుంచి భీమవరం, మంగళం పేట వరకు రూ.8కోట్లతో రోడ్లు నిర్మిస్తాం.
⇒ ప్రతి వీధికీ సీసీ రోడ్డు ఉండేలా చర్యలు చేపడతాం.
⇒ విద్యార్థులు, గృహిణులు చదువుకునేందుకు, పనిచేసేందుకు ఐటీ టవర్ నిర్మిస్తాం.
⇒ కల్యాణీ డ్యామ్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment