సింగపూరు కలలతో నారావారి పల్లె కడుపు నిండుతుందా?
సింగపూరు కలలతో నారావారి పల్లె కడుపు నిండుతుందా?
Published Sat, May 3 2014 5:10 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరడం అంటే ఏమిటో చంద్రబాబునాయుడు వాగ్దానాలను చూస్తే తెలుస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీమాంధ్రను సింగపూర్ చేసేస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా, ఇరవై ఏళ్లు అధికార పార్టీ ముఖ్యనేతగా ఉన్నా సొంత ఊరు నారావారిపల్లిని మాత్రం ఏమీ చేయలేకపోయారు.
తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న బాబు ఏనాడూ తమని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఆ ఊరి ప్రజలు. సొంత గ్రామంలో పూరి గుడిసెలు వెక్కిరిస్తుంటే, సింగపూర్ను సీమాంధ్రకి తెస్తానంటే ఎలా నమ్మేది అంటున్నారు నారావారిపల్లె గ్రామస్తులు.
ఎటు చూసినా పూరి గుడిసెలతో కనిపిస్తుంది నారావారిపల్లె దళితవాడ. నారావారిపల్లెలోని దళితులు 30 ఏళ్లుగా పక్కా గృహాలకు నోచుకొలేక పోయారు. ఎపక్కా గృహాలు మంజూరు చేయించాలని ఎన్నొసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నది లేదని వారంటున్నారు. దాదాపు తెలుగు దేశం పార్టీ పుట్టినప్పుడు తాము నారావారిపల్లెకు వచ్చామని దళిత వాడ నివాసులు తెలిపారు. మూడు దశాబ్ధాలు దాటినా ఇప్పటికీ సొంతింటికి నోచుకోలేకపోయామని వారరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారావారిపల్లిలో ఓ చక్కటి సిమెంట్ రోడ్డు వుంది. ఈ రోడ్డు కూడా చంద్రగిరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుడా చైర్మెన్‌గా ఉన్నప్పుడు వేసింది. తుడా చైర్మెన్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నారావారి పల్లె అభివృద్దికి కృషి చెశారు. కాని చంద్రబాబునాయుడు మాత్రం సింగపూరు కబుర్లతో నారావారిపెల్లె కడుపు నింపుతున్నారని ఆ గ్రామస్తులు అంటున్నారు.
Advertisement