ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర
కర్నూలు(అర్బన్): రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతిస్తే నారావారిపల్లె నుంచి మాదిగ చైతన్య రథయాత్రను తిరిగి కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సుభాష్ చంద్రమాదిగ తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా రూపొందించామన్నారు. స్థానిక కోల్స్ కళాశాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందని, హైకోర్టు ధర్మాసనం రథయాత్రను నారావారిపల్లె నుంచి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర నాయకుడు బి. నరసింహులు మాదిగ మాట్లాడుతూ ఏప్రిల్ 30న విజయవాడలో మాదిగల విశ్వ రూప మహాసభ జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 నుంచి మాదిగల చైతన్య రథయాత్ర మంద కృష్ణ నాయకత్వంలో కొనసాగుతుందన్నారు. నారావారిపల్లె నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో టౌన్ ఇన్‌చార్జీ రవి, గౌరవ సలహాదారు తిమోతీ, కల్లూరు మండలాధ్యక్షుడు కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాగన్న తదితరులు పాల్గొన్నారు.
నారావారిపల్లె నుంచి రథయాత్ర
Published Fri, Mar 18 2016 4:28 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
Advertisement
Advertisement