chaitanya yatra
-
వైభవంగా ‘గంగమ్మ’ భక్తి చైతన్య యాత్ర
సాక్షి, తిరుపతి/తిరుపతి కల్చరల్: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరలో ఐదో రోజైన ఆదివారం భక్తి చైతన్య యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. డప్పు దరువుల నడుమ గంధం, కుంకుమ బొట్లు ధరించి, వేపాకు చేతపట్టిన జనం భక్తి పారవశ్యంతో చిందులేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ చేశారు. అమ్మవారు, దేవతామూర్తులతో పాటు వివిధ వేషధారణల్లో తమ భక్తిని చాటుకున్నారు. తొలుత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యుటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు తదితరులు అనంతవీధికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి చైతన్య యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అనంతవీధి, పరసాలవీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, గాందీరోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ తల్లి గుడికి చేరుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 విగ్రహాలతో.. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పలువురికి గంధం పూసి, కుంకుమ బొట్లు పెట్టారు. మాతంగి వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు దరువులు, కోలాటాలు, జానపద నృత్యాలతో నగరమంతా సందడిగా మారింది. సారె సమర్పించిన మంత్రి రోజా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మంత్రి ఆర్కే రోజా ఆదివారం సారె సమర్పించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజా మాట్లాడుతూ.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. గంగమ్మతల్లి ఆలయానికి సీఎం జగన్‌ను తీసుకువచ్చి, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, ఈఓ మునికృష్ణయ్య పాల్గొన్నారు. -
రైతులకు చైతన్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు మధ్య దూరం పెరుగుతోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు సీజన్ ప్రారంభానికి ముందు మే నెలలో వారంపాటు రైతు చైతన్య యాత్రలను వ్యవసాయ శాఖ నిర్వహించేది. సీజన్‌కు ముందు రైతులకు కొత్త వంగడాలు, పథకాలు, పంట రుణాలు, సాగునీటి వసతి, వర్షపాతం, విద్యుత్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఎలాంటి పంటలు వేసుకోవాలో కూడా సూచించేవారు. ప్రతీ గ్రామంలో రైతు చైతన్య యాత్రలు జరగడం వల్ల కిందిస్థాయిలో రైతులకు, అధికారులకు మధ్య సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు రైతు చైతన్య యాత్రలు నిలిచిపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లక్షలాది రైతులకు దూరం గతంలో రైతు చైతన్య యాత్రలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశు సంవర్థకశాఖ తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యేవారు. సీజన్‌కు సన్నద్ధతపై వివరించేవారు. కొత్త వంగడాలు, విత్తనాలు ఎప్పుడు చల్లాలి, ప్రభుత్వ పథకాలు, ఎలాంటి పంటలకు డిమాండ్ ఉందనే విషయాలను చెప్పేవారు. సీజన్‌ను త్వరగా ప్రారంభించేలా చైతన్యం కలిగించేవారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేవారు. పంట రుణాలపై బ్యాంకర్లు చెప్పేవారు. మోటార్లకు విద్యుత్ అందించే విషయంలో వివరించేందుకు విద్యుత్ అధికారులు.. సాగునీటి వసతి, కాలువల్లో నీటిని వదిలే విషయాలను వెల్లడించేందుకు నీటిపారుదల అధికారులు హాజరయ్యేవారు. ఇతరత్రా అన్ని రకాల వివరాలను చెప్పేందుకు రెవెన్యూ అధికారులు కూడా వచ్చేవారు. ఒకరకంగా రైతులకు ఇదో వర్క్‌షాప్ మాదిరిగా ఉండేది. ఇలా రాష్ట్రంలోని మొత్తం 12 వేల గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. దాదాపు 10 లక్షల మంది హాజరయ్యేవారని వ్యవసాయవర్గాలు చెప్పాయి. ప్రత్యామ్నాయంగా నిలవని రైతు వేదికలు రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు 2,500 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో ఏఈవో కేంద్రంగా వీటిని నెలకొల్పింది. వాటిల్లో రైతులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. కానీ రైతు వేదికలు ఆ మేరకు సేవలు అందించలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. రైతు చైతన్య యాత్రలు ప్రతీ గ్రామంలో కొనసాగేవి. కానీ రైతు వేదికలు చైతన్య యాత్రలకు ప్రత్యామ్నాయంగా నిలవడంలేదు. అదీగాక కిందిస్థాయిలో ఉన్న ఏఈవోలకు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించే పరిస్థితి లేదు. అలాగే, రైతు వేదికలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్య, విద్యుత్, సాగునీటిపారుదల తదితర శాఖల అధికారులు వచ్చే పరిస్థితి లేదు. గత నెలన్నర రోజులుగా అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. కనీసం క్షేత్రస్థాయికి వెళ్లడానికి కూడా రాష్ట్రస్థాయి అధికారులు ఆసక్తి ప్రదర్శించడంలేదన్న ఆరోపణలున్నాయి. కాగా, వ్యవసాయ అధికారులకు రైతుబంధు, రైతుబీమా పనులు, ఇతరత్రా రోజువారీ సమాచార సేకరణ, ఆ డేటా అప్లోడ్ వంటి పనులతోనే సరిపోతోందన్న వాదన ఉంది. -
వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’
సాక్షి, తిరుపతి: అధికార వికేంద్రీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రాయలసీమ హక్కుల నేతలు వెల్లడించారు. జనవరిలో శ్రీశైలం నుంచి అమరావతి వరకు చైతన్య యాత్ర చేస్తామన్నారు. ప్రతి ప్రాంతంలోని విశ్వ విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని రాయలసీమ హక్కుల నేతలు భూమన్, చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ అమరావతిలోనే రాజధాని ఉండాలనుకోవడం దుర్మార్గమన.. దీనివల్ల మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతామన్నారు. చంద్రబాబు, నారాయణ, రామకృష్ణ రాయలసీమ ద్రోహులని మండిపడ్డారు. త్వరలో వీళ్ల బండారం ప్రజల వద్ద బట్టబయలు చేస్తామని భూమన్, చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. చదవండి: Christmas-Sankranti Holidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే.. -
ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిలో భాగమైన చేనేతను రక్షించేందుకు యువత ఖాదీ వస్త్రాలు ధరించాలని కోరుతూ యాదగిరి గుట్ట యువకులు ‘ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్’పేరిట చైతన్య యాత్ర చేపట్టారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన చేనేత కార్మికుడు నరేశ్, సాదువెల్లికి చెందిన రాజశేఖర్ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. 18 రోజుల అనంతరం గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ల మీదుగా ప్రయాణించి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. దేశంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, దాన్ని కాపాడేందుకు ఖాదీ వస్త్రాలు ధరించాలని ఆయా రాష్ట్రాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. వీరిరువురి యాత్ర ఢిల్లీ చేరుకున్న సందర్భంగా ఎంపీ డి.రాజా, మాజీ ఎంపీ ఆనందభాస్కర్ ఇక్కడి తెలంగాణ భవన్లో వారికి స్వాగతంపలికి సన్మానించారు. అనంతరం నరేశ్, రాజశేఖర్ మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని రక్షించేందుకు, యువతను ఖాదీ వైపు మళ్లించడానికి యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. జీఎస్టీ, విద్యుత్ చార్జీల పెంపు వల్ల పలు రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డి.రాజా కోరారు. -
విమోచనం‘పై ఎందుకు మాటమార్చారు
సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మారుస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డితో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రజాకార్ల వారసులైన ఎంఐఎం, ఒవైసీ సోదరుల మెప్పుకోసమే అధికారికంగా తెలంగాణ విమోచనోత్సవాలను దూరం పెడుతున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో చైతన్యయాత్ర ప్రారంభిస్తారన్నా రు. మజ్లిస్ మెప్పు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా సీఎం కేసీఆర్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. -
‘చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ అమలుకాలేదు’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చకపోవడంపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య వాయిదా పడటమే కానీ పరిస్కారం కావడం లేదని బాధితులు చేపట్టిన బస్సు యాత్ర రామవరప్పాడు సెంటర్ చేరుకుంది. బస్సు యాత్రకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఘన స్వాగతం పలికారు. బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా సీఎం చంద్రబాబు సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను అధికారికంగా లెక్కించడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సెప్టెంబర్ 16 లోగా స్పందించకుంటే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీపఘై జిల్లా నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపుడి శంకర్, మేధావుల సంఘం నేత చలసాని నివాస్ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 16 నుంచి నెల రోజులపాటు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కొనసాగే ఈ యాత్ర నేటి సాయంత్రానికి రామవరప్పాడు సెంటర్ చేరుకుంది. బాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రూ. 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన తరువాత కూడా 35 మందికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
16 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య వాయిదా పడుతుందే కానీ పరిస్కారం కావడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు అన్నారు. బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వ న్యాయవాదులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలపై లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 16 నుంచి నెల రోజులపాటు అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్నబాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రూ. 5 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన తరువాత కూడా 35 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులందరికీ ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. -
ఐదారొందల ఫొటోలు దిగా..!
‘సాక్షి’ మూడే ప్రచురించింది విదేశీ యువతులతో ఫొటోలపై స్పందించిన లోకేశ్ 20 రోజులు దేశమంతా తిరిగినట్లు వెల్లడి సెల్ఫీలు దిగితే తప్పేంటని ప్రశ్న అనంతపురం టౌన్: సెల్ఫీలు దిగితే తప్పా? సెల్ఫీలు దిగేటప్పుడు యువకులుగా మనం ఫేస్‌లు విచిత్రంగా పెట్టమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 2006లో స్టాన్ ఫర్డ్ నుంచి వచ్చిన మిత్రులందరితో కలసి 20 రోజుల పాటు దేశమంతా తిరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో ఐదారొందల ఫొటోలు దిగానని, అయితే అందులోంచి మూడు ఫొటోలే ’సాక్షి’ పత్రికలో వేశారని అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా బుధవారం అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ’ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ’మీరు ఫారిన్ గర్ల్ల్స్తో తిరిగారనే ప్రచారం జరుగుతోంది.. అది నిజమా?’ అని సునీల్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేశ్ పైవిధంగా స్పందించారు. మరో ఐదుసార్లు చంద్రబాబే సీఎం! ఏపీకి హోదా వల్ల ఉద్యోగాలు రావని, ప్రత్యేక రాయితీలతోనే అవి సాధ్యమని లోకే‹శ్అన్నారు. రాష్ట్రానికి అనేక కంపెనీలు వస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అనంతపురం జిల్లాకు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌ను తెస్తామన్నారు. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. మరో ఐదుసార్లు చంద్రబాబే రాష్ట్రానికి సీఎంగా ఉంటారన్నారు. బాబుకు అండగా ఉంటారో.. జగన్ తో నిలబడతారో ఆలోచించుకోవాలన్నారు. ‘సాక్షి’ దినపత్రికపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. పార్టీ శిక్షణ కార్యక్రమంలో తాను హోంమంత్రి చినరాజప్పతో మాట్లాడుతుంటే ఆ ఫొటోను పెద్దదిగా చేసి నిలదీస్తున్నట్లు వార్త రాశారని ఆరోపించారు. దేవాన్ష్ పేరుతో రూ.19 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. తర్వాత జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి లోకేష్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ తిప్పేస్వామికి అవమానం టీడీపీ బీమా లబ్ధిదారులతో భేటీ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ తిప్పేస్వామికి అవమానం ఎదురైంది. భవ నంపై అంతస్తులోకి వెళ్లకుండా గేట్ వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకట్రాముడు అక్కడకు వచ్చి తిప్పేస్వామిని లోపలికి తీసుకెళ్లారు. -
అమరావతి పేరుతో దోపిడీ
ప్యాకేజీలతో పొందేది పర్సంటేజీలు కాంగ్రెస్ చైతన్యయాత్రలో పళ్లంరాజు తుని : అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ధ్వజమెత్తారు. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీ సాధించిన సీఎం చంద్రబాబు కమీషన్లు దండుకునేందుకు కల్లబొల్లి మాటలు వల్లిస్తున్నారన్నారు. తుని లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ సీహెచ్. పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ చైతన్య యాత్ర సమావేశంలో పళ్లంరాజు బీజేపీ, టీడీపీల పై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు కాకుండా రాష్ట్రానికి అదనంగా ఏమి తెచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను గాలికొదిలేశారని, సంక్షేమ ప«థకాలను జన్మభూమి కమిటీలకు అప్పగించి అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి జేడీ శీలం మాట్లాడుతూ గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించేందుకు భయపడుతున్నారన్నారు. ప్యాకేజీని హోదాతో ముడిపెట్టడం సరికాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేసేందుకు రూపొందించిన కాంగ్రెస్ చైతన్య యాత్రను తూర్పు సెంటిమెంటుతో తుని నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుందుల దుర్గేష్, పరిశీలకుడు పక్కాల సూరిబాబు పాల్గొన్నారు. -
నారావారిపల్లె నుంచి రథయాత్ర
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర కర్నూలు(అర్బన్): రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతిస్తే నారావారిపల్లె నుంచి మాదిగ చైతన్య రథయాత్రను తిరిగి కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సుభాష్ చంద్రమాదిగ తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా రూపొందించామన్నారు. స్థానిక కోల్స్ కళాశాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందని, హైకోర్టు ధర్మాసనం రథయాత్రను నారావారిపల్లె నుంచి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుడు బి. నరసింహులు మాదిగ మాట్లాడుతూ ఏప్రిల్ 30న విజయవాడలో మాదిగల విశ్వ రూప మహాసభ జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 నుంచి మాదిగల చైతన్య రథయాత్ర మంద కృష్ణ నాయకత్వంలో కొనసాగుతుందన్నారు. నారావారిపల్లె నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో టౌన్ ఇన్చార్జీ రవి, గౌరవ సలహాదారు తిమోతీ, కల్లూరు మండలాధ్యక్షుడు కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన లోపం.. రైతులకు శాపం..!
పరిగి, న్యూస్‌లైన్: ఎరువుల వాడకంలో రైతుల్లో అవగాహన లోపించింది. నేలల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాల్సి ఉండగా రైతులు ఆ విషయూన్ని పట్టించుకోవడం లేదు. రైతుల కోసం చైతన్య యాత్రలు, అవగాహన సదస్సులు, పొలంబడి తదితర అనేక కార్యక్రమాలు వ్యవసాయ శాఖ చేపడుతున్నప్పటికీ అన్నదాతలకు ఈ విషయుమై ప్రాథమిక సమాచారం కూడా అందిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాకు చెందిన నేలల భూసారం, నేల స్వభావాన్ని బట్టి ఈ ప్రాంతంలో డీఏపీని(అడుగు మందు) దుక్కిలోనే వేయాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా ఐదుశాతం రైతులు కూడా ఈ విధానాన్ని పాటించడం లేదు. కేవలం పసుపు, మొక్కజొన్న పంటలకు మాత్రమే డీఏపీనీ రైతులు దుక్కి మందుగా వాడుతున్నారు. డీఏపీని కూడా యూరియా వూదిరి పైపాటి ఎరువుగా వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యవసాయు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.. మోతాదుకు మించి డీఏపీ వాడకం నేల స్వభావం, భూసారంపై రైతులకు అవగాహన లేకపోవడంతో డీఏపీని రైతులు మోతాదుకు మించి వాడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చివు జిల్లాలోని నేలల్లో భాస్వరం మధ్యస్తంగా, పొటాషియం ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంత నేలలను బట్టి ఎకరానికి పంటకాలంలో 50 కేజీల డీఏపీ మాత్రమే వాడాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా రైతులు ఎకరానికి 100 నుంచి 150 కేజీల వరకు డీఏపీని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ మందును పైపాటుగానే వేస్తున్నందునా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నియోజక వర్గంలో ఇలా వాడుతున్నారు రెండు మూడు సంవత్సరాలుగా పరిగి నియోజక వర్గానికి ఖరీఫ్ ఆరంభంలోనే 4 వేల నుంచి 5 వేల టన్నుల ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇందులో మెజార్టీ భాగం డీఏపీనే ఉంటోంది. కాగా సరఫరా అవుతున్న ఎరువుల్లో 20 శాతం కూడా జూలై మాసంలో వాడటంలేదు. అంటే విత్తుకునే సమయంలో దుక్కి ఎరువుగా రైతులు డీఏపీని వాడటంలేదని అర్థవువుతోంది. జిల్లా భూముల సారాన్ని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని పేర్కొంటున్నారు. డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పని సరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందునా ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగులాల లోతులో డీఏపీ వేయాలి. మిగత అన్ని ఖరీప్పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి. యూరియా ప్రతి ఎకరానికి వందకిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి యూరియా విత్తిన 20 రోజుల నుంచి ఐదుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగు సార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తరువాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది.