వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’ | Chaitanya Yatra In January In Support Of Decentralization | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’

Published Sat, Dec 18 2021 4:55 PM | Last Updated on Sat, Dec 18 2021 7:42 PM

Chaitanya Yatra In January In Support Of Decentralization - Sakshi

సాక్షి, తిరుపతి: అధికార వికేంద్రీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రాయలసీమ హక్కుల నేతలు వెల్లడించారు. జనవరిలో శ్రీశైలం నుంచి అమరావతి వరకు చైతన్య యాత్ర చేస్తామన్నారు. ప్రతి ప్రాంతంలోని విశ్వ విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని రాయలసీమ హక్కుల నేతలు భూమన్‌, చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ

అమరావతిలోనే రాజధాని ఉండాలనుకోవడం దుర్మార్గమన.. దీనివల్ల మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతామన్నారు. చంద్రబాబు, నారాయణ, రామకృష్ణ రాయలసీమ ద్రోహులని మండిపడ్డారు. త్వరలో వీళ్ల బండారం ప్రజల వద్ద బట్టబయలు చేస్తామని భూమన్‌, చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.
చదవండి: Christmas-Sankranti Holidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement