విమోచనం‘పై ఎందుకు మాటమార్చారు
సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మారుస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డితో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రజాకార్ల వారసులైన ఎంఐఎం, ఒవైసీ సోదరుల మెప్పుకోసమే అధికారికంగా తెలంగాణ విమోచనోత్సవాలను దూరం పెడుతున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో చైతన్యయాత్ర ప్రారంభిస్తారన్నా రు. మజ్లిస్ మెప్పు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా సీఎం కేసీఆర్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు విమర్శించారు.