ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14న నారావారిపల్లెకు రానున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ సోమవారం ఓ ప్రకటనలో
చిత్తూరు (అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14న నారావారిపల్లెకు రానున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14న మధ్యాహ్నం 3.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్ర యం చేరుకుంటారు. అక్కడ నుంచి 4.10 గంటలకు బయలుదేరి తిరుపతి-కరకంబాడి రోడ్డులో హోటల్ మానస సరోవర్ చేరుకుంటారు.
ఇక్కడ మానససరోవర్ ప్రీమియంను, సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభిస్తారు. 5.50 గంటలకు నారావారిపల్లెకు చేరుకుని బస చేస్తారు. 15న నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 16న ఉదయం 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు.