నారావారిపల్లె ముస్తాబు | cm chandra babu owne village Decorated | Sakshi
Sakshi News home page

నారావారిపల్లె ముస్తాబు

Published Sun, Jan 11 2015 2:18 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

నారావారిపల్లె ముస్తాబు - Sakshi

నారావారిపల్లె ముస్తాబు

చంద్రగిరి: సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భం గా స్వగ్రామం నారావారిపల్లెకు రానున్నారు. ఇందుకోసం జిల్లా అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం కలెక్టర్ సిద్ధార్‌‌థ జైన్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాం తి సందర్భంగా సీఎం మూడు రోజుల పర్యటన ఉంటుందన్నారు. తిరుపతి లోని పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారని తెలిపారు.

దీంతో  నారావారిపల్లిలో కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం రాక నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యే లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ చేరుకునే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తగా భోజన ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది దాకా రావచ్చని అంచనా వేశామన్నారు. టీటీడీ కల్యాణమండపం సమీపంలో భోజన ఏర్పాట్లకు స్థలాన్ని ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, చంద్రగిరి ఎంపీడీవో డాక్టర్ వెంకటనారాయణ, తహశీల్దార్ కిరణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement