చంద్రగిరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నారావారిపల్లెకు వస్తుండటంతో రాక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి గురువారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈ మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి నారావారిపల్లెకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం నివాసం, తల్లిదండ్రుల సమాధి, టీటీడీ కల్యాణ మండపం వద్ద తనిఖీలు చేపట్టారు. కాగా సీఎం వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ బుధవారం రాత్రి నారావారిపల్లెకు చేరుకున్నారు.
భద్రతపై అధికారుల సమీక్ష
రేణిగుంట: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతపై విమానాశ్రయంలో అధికారులు సమీక్షించారు. సీఎం గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుని ఇక్కడి నుంచి నారావారిపల్లెకు వెళతారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశుక్లా, విమానాశ్రయ అధికారులు సమీక్ష నిర్వహించారు.
కాన్వాయ్ ట్రయల్ రన్ సక్సెస్
తిరుపతి క్రైం: గురువారం సీఎం ప్రయా ణించే మార్గాల్లో బుధవారం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి రోడ్డులో ఉన్న మానససరోవరం, అక్కడినుంచి అలిపిరి, జూపార్కు, చెర్లోపల్లి మీదుగా నారావారిపల్లె వరకు నిర్వహించిన ట్రయల్న్ర్‌లో కలెక్టర్ సిద్ధార్థజైన్, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, నగరపాలక కమిషనర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు.
నారావారిపల్లెలో కట్టుదిట్టమైన భద్రత
Published Thu, Jan 14 2016 1:55 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement