పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయంపై ఆదివారం జిల్లాలోని చంద్రగిరి నారావారిపల్లిలో జరగనున్న ప్రజాసదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.