అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు.