అధికార వికేంద్రీకరణతోనే ఆంధప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాసదస్సును నిర్వహించారు.