సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించడాన్ని తప్పుబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రగిరిలో 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ అంటేనే ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ అని ట్విటర్‌లో ధ్వజమెత్తారు.
'ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆపార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగ వెర్రులెందుకు? పాతికేళ్ళుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజస్వరూపం బయటపడినందుకా? చంద్రబాబు ఆయన కుల మీడియా పార్టనర్ల మోసాలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే నమ్మిన వాళ్లను తడిగుడ్డతో గొంతులు కోయడంలో వాళ్ళ నైపుణ్యం ఏమిటో తెలిసిపోతోంది. గుడితోపాటు గుడిలో లింగాన్ని కూడా మింగటం అనే సామెత వీరిని చూసే పుట్టి ఉంటుంది. బయట పడకపోతే తెలుగు రాష్ట్రాలను శాశ్వతంగా చెరబట్టే వారే' అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment