చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం 5 చోట్ల రీపోలింగ్ ఆదేశించింది. ఇక ఏపీలో ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఈసీపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు మరోసారి అదే పంథా అనుసరించారు. రీపోలింగ్‌పై ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన బాబు శుక్రవారం సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో భేటీ అయ్యారు.