
న్యూఢిల్లీ : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం 5 చోట్ల రీపోలింగ్ ఆదేశించింది. ఇక ఏపీలో ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఈసీపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు మరోసారి అదే పంథా అనుసరించారు. రీపోలింగ్‌పై ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన బాబు శుక్రవారం సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో భేటీ అయ్యారు. అయితే, ఈసీ నిర్ణయంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు అక్కడ చుక్కెదురైంది. చంద్రగిరిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ పాల్పడిన వీడియోను ఈసీ అధికారులు ఆయనకు చూపించారు. పచ్చతమ్ముళ్ల బాగోతం బయటపడడంతో షాకైనా బాబు.. అక్కడ నుంచి సైలెంట్‌గా వెనక్కొచ్చేశారు.
మరోవైపు ఏపీలో రీపోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. రెండోసారి రీపోలింగ్ జరపకూడదని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఘటన ఆలస్యంగా తమ దృష్టికి రావడం వల్లే ఆదివారం (మే 19) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 19 (ఆదివారం)న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్ జరగనుంది. 321-ఎన్‌ఆర్ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఢిల్లీలో గగ్గోలు పెట్టేందుకు ప్రయత్నించిన బాబుకు షాక్
Comments
Please login to add a commentAdd a comment