సాక్షి, టాస్‌్కఫోర్స్: చంద్రగిరి ఎమ్మెల్యే నాని అనుచరులు ఇష్టమొచి్చనట్లు లేచిపోతున్నారు. పోలీసులన్నా, చట్టాలన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి వచి్చన రజక సామాజిక వర్గానికి చెందిన దంపతులు, వారికి మద్దతుగా వచి్చన సమీప బంధువువైన మహిళపై పోలీస్ స్టేషన్‌లోనే సీఐ ఎదురుగా నాని అనుచరుడు చెప్పుతో దాడికి దిగాడు. బాధితుల కథనం మేరకు వివరాలు..
చంద్రగిరి మండలంలోని అగరాలకు చెందిన భవిత, సురేష్ దంపతులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు జయచంద్రారెడ్డి మధ్య గత కొంత కాలంగా ఆరి్థక లావాదేవీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగర్ కాలనీలోని వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ జయచంద్రారెడ్డి హెచ్చరించాడు. ఈ క్రమంలో శనివారం చంద్రగిరికి సమీపంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిచి బెదిరించి, విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.
బాధితులు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించగా.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితులు తిరుపతి ఎస్పీని ఆశ్రయించి జయచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ బాధితులను మళ్లీ స్టేషన్‌కు పిలిచి విచారణ ప్రారంభించారు. బాధితులకు సహాయంగా వారి సమీప బంధువు చంద్రమ్మ తదితరులు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు.
సీఐ సమక్షంలోనే చెప్పుతో దాడి
సీఐ ఇచి్చన సమాచారాన్ని అందుకుని స్టేషన్‌కు వచి్చన జయచంద్రారెడ్డి సీఐ ముందే బాధితులను మరోసారి బెదిరిస్తూ.. ‘‘లం..! నాకే ఎదురు చెబుతావా’’ అంటూ అసభ్య పదజాలంతో రెచి్చపోయాడు. ఈ క్రమంలోనే బాధితులకు సాయంగా వచి్చన మహిళను చెప్పుతో కొట్టాడు. దీంతో బాధితులు కన్నీరు పెట్టుకుంటూ సీఐ గది నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సద్దుమణిగేలా చేసేందుకు ఎమ్మెల్యే నాని అనుచరులు రంగంలోకి దిగారు. వారు స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం చేసేందుకు ప్రయత్నించారని బాధితులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment