చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు | Jallikattu Celebratons in Chandragiri Mandal | Sakshi
Sakshi News home page

చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు

Published Sun, Dec 22 2019 1:25 PM | Last Updated on Sun, Dec 22 2019 4:36 PM

Jallikattu Celebratons in Chandragiri Mandal - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం కందులవారుపల్లిలో జల్లికట్టు సంబరాలు ఘనంగా జరిగాయి. కోడెగిత్తలను ఉరికిస్తూ యువత ఈ వేడుకలో పాల్గొన్నారు. కోడెగిత్తలను పట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించారు. ఎద్దుల కొమ్ములకు ఉన్న బహుమతులు పొందేందుకు ఎగబడ్డారు. అయితే, కోడె గిత్తల వేగాన్ని అందుకోలేక యువకులు కొంత బేజారెత్తిపోయారు. ఈ క్రమంలో పోటీలో పాల్గొన్న పలువురు యువకులకు గాయాలయ్యాయి. జల్లికట్టు వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement