సాక్షి, చంద్రగిరి: మహిళను నిర్భంధించి మూడు రోజుల పాటు వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధితురాలు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు, ఉగ్రప్రత్యంగిరా ఆలయ వెనుక భాగంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళా తన పిల్లలతో కలసి నివాసముంటోంది.
మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, 2019లో రాజేష్ అనే మరో వ్యక్తిని వివాహమాడింది. అయితే రాజేష్‌తో గొడవలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో యాదవ సంఘం ద్వారా బాల వీరబ్రహ్మం, జయపాల్, వెంకీ ఆమెకు పరిచయం అయ్యారు. బాల వీరబ్రహ్మం ఆమెను, భర్త రాజేష్‌ను కలుపుతామని నమ్మబలికి పరిచయం పెంచుకున్నాడు.
ఆ తరువాత కొన్ని రోజుల నుంచి వీరబ్రహ్మం వేధించడంతో బాధితురాల కోర్టులో కేసు వేసింది. దీంతో ఈ నెల 17వ తేదీన రాత్రి బాల వీరబ్రహ్మం ఆ మహిళ నివాసానికి చేరుకుని, కోర్టులో వేసిన కేసును వాపసు తీసుకోవాలంటూ కోరాడు. ఆమె దానికి నిరాకరించడంతో పగబట్టిన వీరబ్రహ్మం ఈనెల 20న మరోసారి ఆమెపై దాడి చేసి, నిర్బంధించాడు.
మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. చివరకు వీరబ్రహ్మం చెప్పినట్లు చేస్తానని బాధితురాలు చెప్పడంతో ఆమెను విడిచిపెట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కృష్ణవేణి 23నన తిరుపతి రుయాలో చికిత్స తీసుకుని, గురువారం రాత్రి ఆమె చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ హిమబిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment