మీడియాతో మాట్లాడుతున్న అఖిల, రిత్విక్
సాక్షి, చంద్రగిరి: రెండు మనసులు ఒకటి కావడంతో ప్రేమ వివాహం చేసుకోవడంతో, తమ ప్రాణాలకు అపాయం ఉందంటూ ఓ ప్రేమ జంట గురువారం మీడియాను ఆశ్రయించింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నగొట్టిగల్లు మండలం కమ్మపల్లికి చెందిన మహేంద్ర నాయుడు, లక్ష్మిదేవి ఏ.రంగంపేట సమీపంలో ఓ ప్రైవేటు హాస్టల్ నడుపుతున్నారు. వీరి కుమారుడు రిత్విక్, పుంగనూరు ఎస్‌ఎన్ పేటకు చెందిన వెంకటరాజు, సరస్వతి కుమార్తె అఖిల ఏ.రంగంపేట సమీపంలోని ఓ విద్యాసంస్థలో 2016–17లో కలసి చదువుకున్నారు. చదవండి: మొదటి రాత్రే భార్యను హత్య చేసి..
వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ వివాహాన్ని పెద్దలకు తెలియజేశారు. కులాలు వేరుకావడంతో పెద్దలు వీరి పెళ్లికి అడ్డుచెప్పారు. దీంతో వారిద్దరూ బుధవారం కడపలో వివాహం చేసుకుని, గురువారం చంద్రగిరికి చేరుకున్నారు. అఖిల తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉండడంతో మీడియాను ఆశ్రయించినట్లు ఆ ప్రేమ జంట తెలిపింది. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకోవడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ జంట మీడియా ద్వారా పోలీసులను వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment