
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమజంట మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వివరాలు.. మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్టకు చెందిన కిరణ్(23), రూరల్ మండలం అంకిశెట్టిపల్లె కుసుమ(22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి వివాహానికి అంగీకరించలేదు. దీంతో సోమవారం ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన ఎస్పీ కార్యాలయం సిబ్బంది మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment