
తిరుపతి తుడా/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువును జయించిన జిషిత (2)ను ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేశారు. తిరుపతిలోని రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో 2 రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు. ఆ బాలిక రెండు కాళ్లు, తొడ భాగంలో విరిగిన ఎముకలకు కట్టు వేశారు.
బిడ్డను చూసుకునేందుకు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో బాలికను డిశ్చార్జ్ చేయాలని బంధువులు విజ్ఞప్తి చేశారు. తదుపరి చికిత్సను విశాఖలో అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని వైద్యాధికారులకు నచ్చచెప్పడంతో జిషితను డిశ్చార్జ్ చేశారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ రాత్రి 7.00 గంటల సమయంలో అంబులెన్స్‌లో చిన్నారి జిషితను రైల్వేస్టేషన్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment