
చంద్రగిరి (తిరుపతి రూరల్): జాతీయ స్థాయి అందాల పోటీల్లో చంద్రగిరి యువతి మెరిసింది. ఈ నెల 16న జైపూర్‌లో జరిగిన ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’ పోటీలలో చంద్రగిరికి చెందిన సంజన మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది.
కాగా, ఫైనల్స్‌లో 47 మంది పాల్గొనగా.. వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది. ఆ వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్ మనమరాలైన సంజన మోడలింగ్‌పై మక్కువ పెంచుకుంది. 2023 మేలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్‌లో 300 మందికి పైగా బాలికలు జూమ్ కాల్‌లో పాల్గొనగా.. ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన ఒకరు. ఈ నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో 47 మంది పాల్గొనగా.. వారిలో సంజన మొదటి స్థానం పొందింది.
ఇది కూడా చదవండి: మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment