సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ‍్న తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 11వ తేదీన ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో తాము వెబ్ కాస్టింగ్ నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆ వీడియో ఫుటేజ్‌ను ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగానే ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. 19న జరగనున్న రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, అయిదు పోలింగ్ బూత్‌ల్లో 3,899మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయిదు పోలింగ్ బూత్‌ల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి:
చంద్రగిరిలో రీపోలింగ్‌పై టీడీపీ ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment