chittoor Collector
-
కరోనాను జయించిన కలెక్టర్
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: కరోనా వైరస్ బారినపడిన కలెక్టర్ నారాయణభరత్‌గుప్త కోలుకున్నారు. ఈ నెల 17న ఆయనకు పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి తిరుపతి క్యాంప్ కార్యాలయంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించారు. ఆదివారం మరోసారి పరీక్షించుకోగా నెగిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ నుంచి చిత్తూరు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. జిల్లాలో మార్చి నుంచి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి కరోనా కట్టడికి విశేష సేవలందించారు ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు తెలిపారు. (ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు) -
గాంధీ పేరు రాయలేకపోతున్నారు!
సాక్షి, చిత్తూరు : ‘పదో తరగతి విద్యార్థి గాంధీ పేరు రాయలేకపోతున్నాడు. నేను పాఠశాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం గుర్తించాను. ఇందుకు కారకులెవరు?.’ అని కలెక్టర్ నారాయణ భరత్ గుప్త విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తాను గమనించానన్నారు. తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సిగరెట్ ముక్కలు పడి ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితులుంటే హెచ్ఎంలు ఏమీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న తరగతి గదులు, ప్రహారీ గోడలు తదిత ర పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో ‘నా మొక్క – నా బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో డీఈఓ పాండురంగస్వామి, సమగ్ర శిక్షా అభియాన్ పీఓ మధుసూదనవర్మ, డీవైఈఓ పురుషోత్తం, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణభరత్‌గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్యాకేజీ టూర్ల బలోపేతానికి ఏపీ పర్యాటక సంస్థ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జేసీ మార్కండేయులు, జేసీ2 చంద్రమౌళి, జిల్లా టూరిజం అధికారి చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మైక్రో ఇరిగేషన్ అనుసంధానం చేయాలి నీటి వసతి ఉన్న ప్రతి రైతు నుంచి దరఖాస్తులను ఆహ్వానించి మైక్రో ఇరిగేషన్‌కు అనుసంధానం చేయాలని కలెక్టర్ అన్నారు. ఏపీఎంఐపీ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కువ నీరు అవసరమైన చెరుకు, వరి పం టలకు మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి గత ఏడాది పూర్తి కాని బిందు సేద్యం పరికరాల అమరిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ శాఖతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్యాన్సర్ పై అవగాహన, నివారణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
చిరునవ్వుతో ‘స్పందన’
నిత్యం ఏదో ఒక సమస్యతో ప్రజలు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. అయితే సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకని దుస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని స్పందన అనే పేరుతో నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటితో ప్రారంభం కానున్న స్పందన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, తదితర వివరాలపై సాక్షి కథనం.. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: రేషన్ కార్డు లేదని.. పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు, తాగునీరు, రోడ్లు, భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్నవించుకుంటారు. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుంటారు. గత సర్కారు పాలనలో ప్రజల అర్జీల పరిష్కారానికి కృషి చేసిన పాపానపోలేదు. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే స్పందన పేరుతో ప్రజల అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు మొదటి కార్యక్రమం.. జిల్లా స్థాయిలో స్పందన పేరుతో గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం మొదటిసారి జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రత్యేకంగా ప్రజల కోసం కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ప్రజల అర్జీలను నమోదు చేయనున్నారు. అర్జీదారులందరికీ స్పందన పేరుతో రశీదు ఇవ్వనున్నారు. జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఆయా శాఖల హెచ్ఓడీలు హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో పలు శాఖల అధికారులు తమ కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకునేవారు. ఇకపై అలాంటి విధానం ఉండకుండా ప్రతి శాఖ జిల్లా అధికారే స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది. గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. స్పందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. స్పందన కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తాం. అర్జీ దారులను కూర్చోబెట్టి అప్పటికప్పుడే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – డాక్టర్ నారాయణ భరత్ గుప్త, కలెక్టర్ -
వీడియో ఫుటేజ్ ఆధారంగానే రీ పోలింగ్
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 11వ తేదీన ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో తాము వెబ్ కాస్టింగ్ నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆ వీడియో ఫుటేజ్‌ను ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగానే ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. 19న జరగనున్న రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, అయిదు పోలింగ్ బూత్‌ల్లో 3,899మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయిదు పోలింగ్ బూత్‌ల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: చంద్రగిరిలో రీపోలింగ్‌పై టీడీపీ ఆందోళన ‘ఐదు దశాబ్దాలుగా దళితులను ఓటెయ్యనీయలేదు’ చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్ -
పక్కాగా ఈవీఎం ర్యాండమైజేషన్
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల ర్యాండమైజేషన్ల ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నోడల్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ఈనెల 15 నుంచి 18వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించిన ఏర్పాట్లను 20 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 17వ తేదీన మొదటి విడత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఉంటుందన్నారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయాలి.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుం దని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో, మూడు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేసే ఒక రోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతా ను తెరవాలన్నారు. పోలింగ్ సిబ్బంది 16న శిక్షణ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఈనెల 16న శిక్షణ ఉంటుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం సిబ్బం దికి పీలేరులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో, మదనపల్లె వారికి బీటీ కళాశాల, పుంగనూరు వారికి గోకుల్ థియేటర్, చంద్రగిరి వారికి తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా ఆడిటోరియం, తిరుపతి వారికి శ్రీనివాస ఆడిటోరియం (ఎస్వీయూ)లో, శ్రీకాళహస్తి వారికి స్కిట్ కళాశాల, సత్యవేడు వారికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నగరి వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జీడీనెల్లూరు వారికి జిల్లాపరిషత్ హైస్కూల్, చిత్తూరు వారికి నాగయ్య కళాక్షేత్రం, పూతలపట్టు వారికి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, పలమనేరు వారికి పీఆర్ కన్వెక్షన్ హాలు, కుప్పం వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుం దని తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాలోని ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈఆర్వో కార్యాలయాల్లో, 26 సరిహద్దు చెక్‌పోస్టులు, కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్, సీ విజిల్ యాప్ ఫిర్యాదుల పరిష్కార విభాగం, మీడియా సెంటర్, ఎంసీఎంసీ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న బుధవారం ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారాలను పరి శీలించేందుకు జెడ్పీ సిబ్బంది 20 మందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో గంగాధరగౌడ్, నోడల్ అధికారులు లక్ష్మి, శ్రీనివాస్, పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు. -
సుస్థిర అభివృద్ధే ధ్యేయం
చిత్తూరు కలెక్టరేట్ : సుస్థిర అభివృద్ధే ధ్యేయం కలిసికట్టుగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. శనివారం స్థానిక డీటీసీ పెరేడ్ మైదానంలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ఉదయం 7.45 గంటలకు కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసులు, ఎన్సీసీ విద్యార్థుల నుంచి కలెక్టర్ గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశిం చి కలెక్టర్ ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని చెబుతూ జిల్లా అభివృద్ధి గురించి వివరించారు. ఈ వేడుకల్లో ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జాయింట్ కలెక్టర్ గిరీషా, జేసీ– 2 చంద్రమౌళి, డీఆర్వో గంగాధరగౌడ్, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, నగర మేయర్ కఠారి హేమలత తదితరులు పాల్గొన్నారు. పడమటి మండలాలు సస్యశ్యామలంగా.. కరువుతో తల్లడిల్లుతున్న పడమటి కరువు సీమను రతనాల సీమగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డీఆర్డీఏ ద్వారా జిల్లాలో దాదాపు 4.50 లక్షల మంది గ్రామీణ డ్వాక్రా మహిళలకు రూ.1571 కోట్ల బ్యాంకు రుణాలను మంజూరు చేసి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మెప్మా ద్వారా రూ.399 కోట్ల బ్యాంకు రుణాలను అందజేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. మహిళల ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన స్వచ్ఛభారత్ ఉద్యమానికి జిల్లా ప్రజల నుంచి గొప్ప సహకారం లభించిందన్నారు. 2017–18 సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా 2,70,251 వ్యక్తిగత మరుగుదొడ్లను ఉద్యమస్థాయిలో నిర్మించి దేశంలో ప్రథమస్థానం సాధించినట్టు చెప్పారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డీటీసీ పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలను అద్భుతం, అమోఘంగా నిర్వహిం చారు. పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు జయహో అనిపిం చాయి. దేశభక్తి, భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, స్వాతంత్య్ర సమరయోధుల పోరా టం, దేశగొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టతను చాటిచెబుతూ రచించిన గేయాలకు విద్యార్థులు అద్భుతంగా అభినయించారు. ప్రదర్శనను చూసిన కలెక్టర్ ప్రద్యుమ్న విద్యార్థులను అభినందించారు. జాగిలాల విన్యాసాలు, అగ్ని మాపక శాఖ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారు లు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. -
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వృద్ధ రైతు మృతి
-
చిత్తూరు కలెక్టరేట్ వద్ద చెవిరెడ్డి ధర్నా
చిత్తూరు: ప్రజా సమస్యలను చిత్తూరు జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులను కలవని కలెక్టర్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కపక్క సామాన్యులు కష్టాలు పడుతుంటే.. చెప్పాపెట్టకుండా కలెక్టర్ సెలవుపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. 17 రోజుల పాటు కలెక్టర్ సెలవు పెట్టి చంద్రబాబు, లోకేశ్ నల్లధనాన్ని మార్చడానికి వెళ్లారని ఆరోపించారు. -
బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తా
చిత్తూరు : తాతయ్యా నేను కలెక్టర్‌ని, మీకు పింఛను ఇస్తున్నారా ? వెయ్యి రూపాయిలు కరెక్టుగా ఇస్తున్నారా ? పిల్లలు ఎంత మంది ? ఏమీ చేస్తున్నారు ? అంటూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఓ వృద్ధుడిని ఆప్యాయంగా పలుకరించారు. సోమవారం కార్వేటినగరంలో ఓ కల్వర్టుపై కూర్చుని ఉన్న వృద్ధుడు చెంగయ్య వద్దకు కలెక్టర్ వెళ్లారు. కుశల ప్రశ్నలు వేశారు. అతని జేబులో ఉన్న బీడీల కట్టను తీసుకున్నారు. పింఛను ఇచ్చేది బీడీలకు కాదు' అని కలెక్టర్ అనడంతో అక్కడే ఉన్నవారంతా నవ్వేశారు. అలవాటైంది. వదులుకోలేకపోతున్నా సార్ అంటూ బదులుచ్చాడు. అయితే పింఛనుకు బదులు బీడీలు ఇస్తామని కలెక్టర్ అనగానే... వద్దు సార్ వెయ్యి రూపాయిలు లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సిందేనన్నారు. దాంతో కలెక్టర్ 'ఎప్పుడైనా ఈ దారిలో వస్తా, జేబులో బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తానని నవ్వుతూ హెచ్చరించారు. -
డిప్యూటీ తహశీల్దారు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు (అగ్రికల్చర్): చిత్తూరు కలెక్టరేట్లో ఎలక్షన్ విభాగంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న సుధాకర్ బుధవారం విధి నిర్వహణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డిప్యూటీ తహశీల్దారు సుధాకర్ ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. కొంత సమయానికే తాను కూర్చున్న సీటు పైనుంచి సృ్పహ కోల్పోయి కింద పడిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆయన అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగడంతో ఆయన స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్వో విజయ్‌చందర్‌ను వివరణ అడగ్గా కుటుంబ కలహాల కారణంగా సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. -
'చిత్తూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
చిత్తూరు : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మంగళవారం చిత్తూరులో సూచించారు. పీఆర్ కండ్రిగ, నేచనూరు వద్ద నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. అలాగే సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయంలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లాలోని నాగులాపురం, విజయపురం, తొట్టంబేడు మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిద్దార్థ్ జైన్ చెప్పారు. -
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట చెవిరెడ్డి ధర్నా
చిత్తూరు : చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం ధర్నాకు దిగారు. చల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎర్రావారిపాలెం మండలం ఎలమంద గ్రామానికి చెందిన 110 మంది రైతులు చల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా తమ పొలాలు కోల్పోయారని, వీరికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా జిల్లా కలెక్టర్ లేకపోవడంతో గ్రీవెన్స్‌సెల్‌లో వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. -
'కలెక్టర్ వేధింపులు ఎక్కువయ్యాయి'
గిరీంపేట: చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మంగళవారం విధులు బహిష్కరించిన ఉద్యోగులు పాత కలెక్టర్ బంగ్లా నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినం సందర్భంగా తమకు కనీసం ప్రశంస పత్రాలు కూడా ఇవ్వలేదని, ఇటీవలి కాలంలో ఆయన వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంత ఉద్యోగులు మినహా అందరూ విధులు బహిష్కరించారు. చిత్తూరులో జరిపిన ఆందోళన కార్యక్రమానికి దాదాపు వెయ్యిమంది ఉద్యోగులు తరలివచ్చారు. -
చిత్తూరు కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధింపు
-
కస్తూర్బా లో ఫుడ్ పాయిజన్ పై విచారణ
తిరుపతి: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఫుడ్‌పాయిజన్ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గురువారం స్పందించారు. ఈ ఘటనపైన సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. గురుకుల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుజాతను విధుల నుంచి తొలగించారు. అలాగే జిల్లా బాలిక సంరక్షణాధికారి విజయకుమారి, ఎంఈవో బాల సుబ్రహ్మణ్యంలకు నోటీసులు జారీ చేశారు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ ఘటనలో బాధితుల సంఖ్య గురువారానికి 50కి చేరింది. -
సమగ్ర చర్చ
ముకరంపుర: ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో తాగునీరు, కరెంటు, పింఛన్లు, విద్య, వాటర్‌గ్రిడ్, సన్నబియ్యం, హరితహారం, ఎస్సీ కార్పొరేషన్ నిధులు తదితర అంశాలపై సుధీర్ఘంగా సమీక్షించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, ఎంపీ వినోద్‌కుమార్, పార్లమెంటరీ కార్యదర్శి వి.సతీష్‌కుమార్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో దాదాపు ఐదు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిస్తూనే పైన పేర్కొన్న అంశాల్లో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఘాటుగా స్పందించడంతోపాటు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈసారి కరువు ప్రభావం అధికంగా ఉన్నందున ఫిబ్రవరి నుంచి తాగునీటి సమస్య అధికమవుతోంది. దీనిని నివారించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఇకపై మంచినీళ్లు లేక బిందెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చే పరిస్థితి రానీయొద్దు. బోర్లు, బావులు, మంచినీటి ట్యాంకర్లను పెద్ద ఎత్తున లీజుకు తీసుకొనైనా ప్రజలకు మంచినీళ్లు అందించాల్సిందే. రబీలో విద్యుత్ డిమాండ్ తగ్గిన ందున పంటలకు ఆరుగంటల ఉచిత విద్యుత్‌ను రెండు దశల్లో సరఫరా చేయండి. బోర్లు, బావుల్లో నీళ్లు లేకపోవడం వల్ల ఒకేసారి ఆరు గంటలు సరఫరా చేయడంవల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదు. అట్లాగే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిన 24 గంటల్లోనే కొత్త ట్రాన్స్ఫార్మర్ను మార్చండి. ట్రాన్స్ఫార్మర్ మార్పిడి కేంద్రాలను విస్తరించండి. రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా చెరువుల వద్ద టెంట్లు వేసుకుని కూర్చుం టాం. యుద్ధప్రాతిపదికన చెరువుల పునరుద్దరణ కార్యక్రమం జరగాల్సిందే. అవసరమైతే ప్రైవేటు ఏజెన్సీలతో అం చనాలు రూపొందించండి. తగిన నిధులు మంజూరు చేస్తాం. హరితహారంలో భాగంగా సాధ్యమైనంత మేరకు ఎక్కడికక్కడ స్థానికంగానే మొక్కలను కొనుగోలు చేయండి. కొంత ధర ఎక్కువ వెచ్చించైనా కొనుగోలు చేయండి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పాఠశాలల్లో సన్నబియ్యం భోజన పథకం విజయవంతమైతే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రవేశపెడతాం. సన్నబియ్యం భోజనం వల్ల పాఠశాలల్లో హాజరుశాతం పెరుగుతోందనే నమ్మకం కలుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలిస్తామని అనేక ఏజెన్సీలు ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.3లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ ఉద్యోగాలు త్వరలో పర్మినెంట్ అవుతాయని ఆశ జూపడంతో నిరుద్యోగులు మోసపోతున్నారు. త్వరలో దీనిపై రహస్య విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తాం. ఎంతో గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘ఆసరా’లో తప్పటడుగులు దొర్లాయి. సీఎం ఆశయం నెరవేరలేదు. పింఛన్లలో అక్రమాలు జరిగాయి. అర్హులకు పింఛన్లు అందలేదు. సామాజిక తనిఖీ నిర్వహిస్తే 20 శాతాని కిపైగా పింఛన్లు పోవడం ఖాయం. అక్రమార్కులను తేలిగ్గా వదిలిపెట్టం. కఠినచర్యలు తీసుకుంటాం. ఒక్కసారి సస్పెం డ్ చేసిన తరువాత మళ్లీ వారికోసం పైరవీలు చేసేందుకు రాజకీయ నాయకులెవరూ ముందుకు రాకుండా చూస్తాం. దళితుల భూమి కొనుగోలు అంశంపై ప్రత్యేక కమిటీలు వేసి భూ పంపిణీని వేగవంతం చేస్తాం. భూ పంపిణీ నిరంతర ప్రక్రియే తప్ప పంద్రాగస్టు, రిపబ్లిక్ వేడుకల్లో పంపిణీకే పరిమితం చేయబోం. జవాబుదారీగా వ్యవహరించాలి గత ప్రభుత్వాల హయాంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో గుణాత్మక మార్పు రాబోతుంది. పద్ధతి మారింది.. మనమూ మారాలి.. ప్రతీ రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల అవసరాలే ప్రభుత్వ నిర్ణయాలు.. జవాబుదారీతనంపైనే ప్రజల భవిష్యత్తు ఆధారపడివుంది. అధికారికంగా డీఆర్సీ నిర్వహణ లేకపోవడంతో ఎప్పటికప్పుడు సమస్యలపై సమీక్షించుకుందామని మంత్రి అన్నారు. కేవలం చర్చల కోసం కాకుండా అమలు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమస్యలపై చర్చ ఇలా.. భూగర్భజలాలు ఎనిమిది మీటర్లలోతుకు పడిపోయాయని, ఫిబ్రవరి నుంచి సమస్య తలెత్తే ప్రమాదముందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వివరించారు. బోర్లు, పంపుసెట్ల రిపేర్, తాగునీటి ప్రణాళిక కోసం రూ.18.63 కోట్ల అంచనాతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. బోర్‌వెల్స్‌కు ప్రతిపాదనలు పంపామని సమస్యలను గుర్తించి ఫిబ్రవరి నుంచి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్ కోసం రూ.5262కోట్లతో ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసి ఏప్రిల్‌లో టెండర్లు ఆహ్వానిస్తామని వివరించారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ.. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి రూ.8కోట్లు మంజూరు కాగా రూ.4.50 కోట్లు విడుదలయ్యాయని, దానికి హెచ్డీ పైపు వాడాల్సి ఉండగా డీఐ పైపు వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులకు ఏడాదిగా టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పేర్కొన్నారు. ఎంపీ వినోద్‌కుమార్.. వేములవాడలోని వాటర్‌ట్యాంకు నుంచి నీటి సరఫరాకు కరెంటు సమస్య ఉందని, ట్రాన్స్ఫార్మర్కు కెపాసిటీ సరిపోవడం లేదని, సబ్‌స్టేషన్ అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ట్రాన్స్‌కో డీఈ స్పందిస్తూ ట్రాన్స్ఫార్మర్ 3.15 కేవీ నుంచి 5 కేవీకి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపుతామని, రెండింటికీ ఒకే ఖర్చు అవుతుందని చెప్పారు. మంత్రి ఈటెల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిన్న సమస్యలను వారంలోగా పరిష్కారం చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు.. వ్యవసాయానికి నిరంతరంగా ఆరుగంటల విద్యుత్ ఇస్తే బావులు ఎండిపోతున్నాయని, రెండు విడతలుగా కరెంటు ఇవ్వాలని సూచించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. నియోజకవర్గంలో 11 కేవీ వైర్లతో రైతులు చనియారన్నారు. మానకొండూర్ మండలం లక్ష్మీపూర్, కల్వలగ్రామాల్లో 11 కేవీ వైర్ మార్చాలన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రవర్తన బాగాలేదని, రైతులపై కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి.. కోహెడ మండలం ముద్దన్నపేట విద్యార్థినులు రాత్రిపూట బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు జంకుతున్నారని, లైట్లు లేక సమస్య ఉందని, ట్రాన్స్‌కో అధికారులు స్పందించాలన్నారు. మంత్రి ఈటెల స్పందిస్తూ.. జిల్లావ్యాప్తంగా 11కేవీ లైన్ల కోసం ప్రైవేట్ తన్కీబేస్లో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. లూజ్‌లైన్ మిడ్‌పోల్స్ ఏర్పాటుపై సమీక్షించుకోవాలన్నారు. జిల్లాలో అంబాల, శంభునిపల్లి, సిరిసేడు, గోపాలపూర్ చెక్‌డ్యాంలను నిర్మించామని నీటిపారుదల శాఖ ఎస్ఈ తెలిపారు. జిల్లాలో ఇంజనీర్ల కొరత ఉందన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 6.24 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా రూ.1.72 కోట్లు విడుదలయ్యాయని, ఇప్పటివరకు 1.74 కోట్ల మొక్కలు నాటి 25 శాతం పూర్తి చేశామని డీఎఫ్‌వో, డ్వామా పీడీ గణేశ్, ఉద్యానశాఖ ఏడీ జ్యోతి తెలిపారు. టేకు, ఎర్రచందనంతో పాటు మామిడి మొక్కలను నాటుతుండగా, జిల్లాలో మామిడి మొక్కల కొరత ఉందని తెలిపారు. ప్రైవేట్ నర్సరీల ద్వారా ధర ఎక్కువైనా మొక్కలు కొనాలని మంత్రి సూచించారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని డీఈవో లింగయ్య తెలిపారు. మధ్యాహ్నభోజనం, సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. నాలుగు మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో సన్నబియ్యం సరిపడా పంపిణీ కాలేదని, ఈ సమస్య పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి.. అంధుల కోసం జిల్లాలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరగా, ఎమ్మెల్యే రసమయి.. ఇల్లంతకుంట పాఠశాలల్లో నీరు కొనుక్కుని తాగుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్ ద్వారా నీళ్లు సరఫరా చేయాలన్నారు. దళితులకు భూపంపిణీ కింద పత్రాలిచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలదేని మంథని ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. ప్రభుత్వ భూములు కొంత మంది చేతుల్లోనే ఉన్నాయని, స్థానిక తహశీల్దార్ సర్కారు భూమిలో గుడిసెలు వేయించి తీయించడం లేదన్నారు. రెవెన్యూ అదాలత్‌లు పెట్టి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. దీంతో భూముల కొనుగోలుపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని మంత్రి ఈటెల సూచించారు. సదరంపై సమరం... బోగస్ వికలాంగుల సర్టిఫికెట్లపై దుమారం రేగింది. వికలాంగుల పింఛన్ కోసం అర్హులను పక్కనపెట్టి అనర్హులను లబ్దిదారులుగా చేర్చారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్.. సదరం శిబిరంలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై చర్యలేవని ప్రశ్నించారు. బాధ్యతలేని వైద్యుల వల్లే అర్హులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కాటారంలో 22 బోగస్ వికలాంగ సర్టిఫికెట్లు ఒకే గ్రామంలో ఇచ్చారని, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.8-9వేలు తీసుకున్నారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులు వృద్దాప్యంలో తిరిగి వస్తే పింఛన్లు మంజూరు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. బోగస్ సర్టిఫికెట్లతో కొందరు అనర్హులు పింఛన్లు పొందుతుంటే నిజమైన అర్హులు తమ కళ్లమందు కనబడుతున్నారని చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంత్రి స్పందిస్తూ.. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. జోగినులకు, భర్త వదిలిన మహిళలకు పింఛన్లు ఇవ్వడానికి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3.86 లక్షల మందికి పెన్షన్లు మంజూరయ్యాయని డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ తెలిపారు. రూ.వెయ్యి సింగరేణి పింఛన్ పొందుతున్న కార్మికులకు ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. అభయహస్తం కింద ప్రతినెల రూ.500 పింఛన్ ఇస్తామన్నారు. -
ఉత్సాహంగా వచ్చాను
ప్రశాంతమైన జిల్లా. ప్రగతి పథంలో ఉన్న ప్రాంతం. అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్న జిల్లా కరీంనగర్. చాలా ఉత్సాహంతోనే ఇక్కడికి వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘ప్రశాంతమైన జిల్లా. ప్రగతి పథంలో ఉన్న ప్రాంతం. అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్న జిల్లా కరీంనగర్. చాలా ఉత్సాహంతోనే ఇక్కడికి వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా’ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నీతుకుమారి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలివి. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం రాత్రి మాజీ కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కమిషనర్ శ్రీకేష్ లట్కర్లకు ఆత్మీయ వీడ్కోలుతోపాటు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. నీతుకుమారి ప్రసాద్ మాట్లాడుతూ ‘కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రెండో జిల్లా ఇది. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం. వీరబ్రహ్మయ్యగారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఆసక్తిగా ఉన్నాయి. తప్పకుండా పాటిస్తా. విద్య, వైద్య రంగాలు నా ప్రాధాన్యత’ అని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రశాంతమైన , అత్యధిక వృద్ధి రేటున్న జిల్లా అని తనకు సమాచారముందని, అందుకే ఉత్సాహంగా ఇక్కడికి వచ్చానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతలు చాలా ఉన్నాయని, అధికారుల సహకారంతో ఆయా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తానని ఉద్ఘాటించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ.. ఉద్యోగులందరితో కలిసి జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తానని ఆకాంక్షించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సమయం కంటే అదనంగా మరో రెండు గంటలు పనిచేస్తామని జిల్లా తహశీల్దార్ల సంఘం నాయకుడు పద్మయ్య చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ... అధికారులందరి సహకారంతో ప్రభుత్వ ప్రాధాన్యతలను పూర్తి చేస్తానని చెప్పారు. అనంతరం బదిలీపై వెళుతున్న వీరబ్రహ్మయ్య, సర్పరాజ్ అహ్మద్, శ్రీకేష్ లట్కర్‌ను అధికారులు ఘనంగా సన్మానించారు. శభాష్ అన్పించుకుని వెళుతున్నా : వీరబ్రహ్మయ్య ఏడాదిన్నర కాలంలో కలెక్టర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా నియమితులైన వీరబ్రహ్మయ్య అన్నారు. తన హయంలో స్థానిక సంస్థల, సాధారణ, మున్సిపల్ ఎన్నికలు ఏకకాలంలో రావడం, సమర్థవంతంగా ప్రక్రియ ముగించడం మరిచిపోలేనన్నారు. అటెండర్ నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, జాయింట్ కలెక్టర్ వరకు శ్రమించి జిల్లాకు మంచి పేరు తెచ్చారని అన్నారు. ఎక్కడలేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోనే 3 లక్షల 70 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, పది లక్షల మందికి ఆహారభద్రత కార్డులు గుర్తించడం జరిగిందని, జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లలో ముందుందని అన్నారు. రాబోయే సమస్యలివే...! జిల్లాలో రాబోయే కాలంలో కరవు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయని వీరబ్రహయ్య చెప్పారు. వీటిని అధిగమించేందుకు ఉపాధిహామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ పథకం ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, గ్రామ సందర్శన కార్యక్రమం అనుకున్న విధంగా ముందుకు పోలేదని చెప్పిన వీరబ్రహ్మయ్య విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత 64 శాతం మాత్రమే ఉండడం బాధాకరమని, దీన్ని 85 శాతానికి పెంచాలన్నారు. ప్రతీ నాలుగు కాన్పుల్లో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరగడం బాధాకరమన్నారు. లక్ష్యాన్ని సాధించాం: సర్ఫరాజ్ అహ్మద్ అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేశామని సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య సూచనలు, సలహాలు , ఉద్యోగుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, సీఈవో అంబయ్య, మంథని ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగదీశ్వర్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను సమ్మక్క-సారక్కలుగా పోల్చుతూ జిల్లా అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని అనడంతో సభలో నవ్వులు విరిశాయి. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కరీంనగర్: శుక్రవారం సాయంత్రం 6.45 గంట లకు కలెక్టరేట్‌కు చేరుకున్న నీతూకుమారి ప్రసాద్ 6.50కి తన చాంబర్‌కు వచ్చారు. 6.53గంటలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ముందుగా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, ప్రజా ఫిర్యాదుల విభాగం సెల్, కలెక్టరేట్లోని ప్రధాన ఫోర్టికో కారిడార్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టరేట్లోని వరండాలో లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏఓ కార్యాలయంలో పేరుకుపోయిన ఫైళ్లను చూపిస్తూ ఇవేమిటనిప్రశ్నించారు. గోడలకు ఉన్న వాల్‌పోస్టర్లను తొలగించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం 7.30 గంటలకు క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, డ్వామా పీడీ గణేష్, జెడ్పీ సీఈఓ అంబయ్య, డీఎస్వో చంద్రప్రకాశ్, ఏఓ రాజాగౌడ్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహాధర్నాకు తరలిరండి
మదనపల్లె: వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న చిత్తూరు కలెక్టరేట్ వద్ద జరగనున్న మహాధర్నాకు ప్రజలు తరలి రావాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి హరిరాయల్ కోరారు. ఆయన మంగళవారం మదనపల్లెలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షు లు శరత్‌యాదవ్ ఆదేశాల మేరకు మహాధర్నాకు మదనపల్లె నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో యువకులను చిత్తూరుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నేడు హామీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రుణమా ఫీ విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఓ వైపు మహిళలు, మరోవైపు రైతులు రుణాలకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మాత్రం విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి యువకులు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా ఉపాధ్యక్షులు షరీఫ్, కౌన్సిలర్ మహమ్మద్ఫ్రీ పాల్గొన్నారు.