'కలెక్టర్ వేధింపులు ఎక్కువయ్యాయి' | revenue employees dharna against chittoor collector Siddharth Jain | Sakshi
Sakshi News home page

'కలెక్టర్ వేధింపులు ఎక్కువయ్యాయి'

Published Tue, Aug 18 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

revenue employees dharna against chittoor collector Siddharth Jain

గిరీంపేట: చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మంగళవారం విధులు బహిష్కరించిన ఉద్యోగులు పాత కలెక్టర్ బంగ్లా నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినం సందర్భంగా తమకు కనీసం ప్రశంస పత్రాలు కూడా ఇవ్వలేదని, ఇటీవలి కాలంలో ఆయన వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.

ఆయనను వెంటనే బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంత ఉద్యోగులు మినహా అందరూ విధులు బహిష్కరించారు. చిత్తూరులో జరిపిన ఆందోళన కార్యక్రమానికి దాదాపు వెయ్యిమంది ఉద్యోగులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement