సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల ర్యాండమైజేషన్ల ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నోడల్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ఈనెల 15 నుంచి 18వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించిన ఏర్పాట్లను 20 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 17వ తేదీన మొదటి విడత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఉంటుందన్నారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందని చెప్పారు.
అభ్యర్థులు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయాలి..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుం దని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో, మూడు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేసే ఒక రోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతా ను తెరవాలన్నారు.
పోలింగ్ సిబ్బంది 16న శిక్షణ
ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఈనెల 16న శిక్షణ ఉంటుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం సిబ్బం దికి పీలేరులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో, మదనపల్లె వారికి బీటీ కళాశాల, పుంగనూరు వారికి గోకుల్ థియేటర్, చంద్రగిరి వారికి తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా ఆడిటోరియం, తిరుపతి వారికి శ్రీనివాస ఆడిటోరియం (ఎస్వీయూ)లో, శ్రీకాళహస్తి వారికి స్కిట్ కళాశాల, సత్యవేడు వారికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నగరి వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జీడీనెల్లూరు వారికి జిల్లాపరిషత్ హైస్కూల్, చిత్తూరు వారికి నాగయ్య కళాక్షేత్రం, పూతలపట్టు వారికి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, పలమనేరు వారికి పీఆర్ కన్వెక్షన్ హాలు, కుప్పం వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుం దని తెలిపారు.
ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లాలోని ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈఆర్వో కార్యాలయాల్లో, 26 సరిహద్దు చెక్‌పోస్టులు, కలెక్టరేట్‌లో కలెక్టర్, జేసీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్, సీ విజిల్ యాప్ ఫిర్యాదుల పరిష్కార విభాగం, మీడియా సెంటర్, ఎంసీఎంసీ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న బుధవారం ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారాలను పరి శీలించేందుకు జెడ్పీ సిబ్బంది 20 మందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో గంగాధరగౌడ్, నోడల్ అధికారులు లక్ష్మి, శ్రీనివాస్, పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment